News February 18, 2025

పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలపై కలెక్టర్ సమీక్ష

image

పట్టిసీమ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం, తొక్కిసలాటలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్‌ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఈ నెల 26వ తేదీన మహాశివ రాత్రి ఉత్సవాలు పట్టిసీమ వద్ద గోదావరి మధ్యన ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవస్థానంలో జరుగనున్నాయి.  శివరాత్రి ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి పాల్గొన్నారు. 

Similar News

News April 16, 2026

KMR: నేటితో ముగిసిన పదో తరగతి పరీక్షలు

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గురువారంతో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 100 శాతం హాజరు నమోదైనట్లు డీఈవో రాజు వెల్లడించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు, మాల్‌ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఆయన వెల్లడించారు. విద్య, వైద్య, పోలీసు అధికారుల సమన్వయంతో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయన్నారు.

News April 16, 2026

27 సెక్యూరిటీ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్

image

శాశ్వత ప్రాతిపదికన 27 సెక్యూరిటీ మేనేజర్ పోస్టుల భర్తీకి పంజాబ్‌ & సింధ్‌ బ్యాంక్ నోటిఫికేషన్ ఇచ్చింది. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 23-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎగ్జామ్, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.64,820-93,960గా ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ 5-5-26. పూర్తి వివరాలకు www.punjabandsind.bank.in చూడండి.

News April 16, 2026

సిరిసిల్ల: పోలీసుల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం: ఎస్పీ

image

ఎండల తీవ్రత దృష్ట్యా విధుల్లో ఉన్న పోలీసుల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ మహేశ్ బి.గితే తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ సిబ్బందికి ఆయన కూలింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. భానుడి భగభగలకు సిబ్బంది ఇబ్బంది పడకూడదని, క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే వారు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.