News March 23, 2024
పట్టుకోసం కూటమి.. ఆ రెండూ వదలమంటున్న వైసీపీ!

ఉమ్మడి ప.గోలోని 15 నియోజకవర్గాల్లో 2చోట్ల మాత్రమే ఇప్పటి వరకు వైసీపీ MLAలు గెలవలేదు. గత ఎన్నికల్లో 13 స్థానాల్లోనూ వైసీపీ సత్తా చాటినా.. పాలకొల్లు(నిమ్మల), ఉండి(మంతెన రామరాజు)లో TDP జెండానే ఎగిరింది. ఇక కొవ్వూరులో 2012, 19 ఎన్నికల్లో ప్రసన్నకుమార్.. పోలవరంలో 2012, 19లో తెల్లం వైసీపీ నుంచి 2సార్లు MLAలుగా గెలిచారు. ఈసారి జిల్లాపై పట్టుకోసం కూటమి.. ఆ 2 వదిలేది లేదంటూ వైసీపీ పథక రచన చేస్తున్నాయి.
Similar News
News April 24, 2025
ప.గో జిల్లా టాపర్ ఈ బాలికే..!

నరసాపురం మండలంలోని లక్ష్మణేశ్వరం మహాత్మా జ్యోతీ బా పూలే గురుకుల పాఠశాల (బాలికలు)విద్యార్థులు పదో తరగతి ఫలితాలలో ప్రతిభ చూపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని రావి అశ్విని 592 మార్కులు సాధించి జిల్లాస్థాయిలో సాధించి ప్రథమ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపల్ సీహెచ్ కె. శైలజ తెలిపారు. పెరవలి గ్రామానికి చెందిన అశ్విని తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ ఉంటారు.
News April 24, 2025
పాలకోడేరు : ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. కేసు

పాలకోడేరు మండలం మోగల్లు వశిష్ట మెరైన్స్ ఆక్వా పరిశ్రమలో అమ్మోనియా గ్యాస్ లీకై మంగళవారం ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు పలువురు అస్వస్థతకు గురవ్వగా, మరికొంత మంది ఊపిరాడక బయటకు పరుగులు తీసేటప్పుడు గాయాలపాలయ్యారు. దీనిపై ఓ మహిళా కార్మికురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పాలకోడేరు స్టేషన్ రైటర్ నాగరాజు తెలిపారు.
News April 24, 2025
బాలిక మిస్సింగ్ కేసు చేధించిన భీమవరం పోలీసులు

భీమవరం టూ టౌన్ పోలీసులు గంటల వ్యవధిలో 14 సంవత్సరాల బాలిక మిస్సింగ్ కేసును సాంకేతిక పరిజ్ఞానంతో చేధించారు. సీఐ కాళీ చరణ్ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా బాలిక విశాఖపట్నం ట్రైన్ లో వెళ్లినట్లు గుర్తించారు. అక్కడ పోలీసులకు సమాచారం అందించగా బాలికను గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.