News March 23, 2024
పట్టుకోసం కూటమి.. ఆ రెండూ వదలమంటున్న వైసీపీ!

ఉమ్మడి ప.గో 15 నియోజకవర్గాల్లో 2చోట్ల మాత్రమే ఇప్పటివరకు వైసీపీ MLAలు గెలవలేదు. 2019లో 13 స్థానాల్లోనూ వైసీపీ సత్తా చాటినా.. పాలకొల్లు(నిమ్మల), ఉండి(మంతెన రామరాజు)లో TDP జెండానే ఎగిరింది. కొవ్వూరు, 2012(ఉప), 2019 ఎన్నికల్లో ప్రసన్నకుమార్.. పోలవరంలో 2012(ఉప), 2019లో తెల్లం వైసీపీ నుంచి 2సార్లు MLAలుగా గెలిచారు. ఈసారి జిల్లాపై పట్టుకోసం కూటమి.. ఆ 2 వదిలేది లేదంటూ వైసీపీ వ్యూహ రచన చేస్తున్నాయి.
Similar News
News July 5, 2025
ఈనెల 10న జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్: కలెక్టర్

ఈనెల 10న జిల్లాలో పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహించడం జరిగిందని, ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో కూడా పీటీఎం సమావేశాలు నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
News July 5, 2025
పాలకొల్లు: మూడు రోజుల వ్యవధిలో తల్లి కూతురు మృతి

పాలకొల్లులో ప్రైవేట్ ఆసుపత్రిలో బుధవారం ఆడబిడ్డకు జన్మనిచ్చి తీవ్ర రక్తస్రావంతో సంగినీడి జయశ్రీ మృతి చెందిన విషయం తెలిసిందే. డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహారించారని ఆరోపిస్తూ ఆరోజు బంధువులు ఆందోళన చేపట్టారు. శిశువుకు వైద్యం కోసం భీమవరం తరలించారు. ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం వైద్యులు ఇంటికి పంపించేశారు. శనివారం ఉదయం శిశువు మృతి చెందింది. తల్లి, కూతురు మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
News July 5, 2025
ఆచంట: గోదారమ్మకు చేరుతున్న వరద నీరు

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటు పెరుగుతోంది. ఆచంట మండలంలో కోడేరు, పెదమల్లం, కరుగోరుమిల్లి, భీమలాపురం పుష్కర ఘాట్ల వద్దకు వరద నీరు చేరింది. పోలవరం వద్ద గోదావరికి వరద నీరు భారీగా చేరుకోవడంతో మరో రెండు, మూడు రోజుల్లో మరింత వరద ప్రవాహం ఉండొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.