News March 23, 2024

పట్టుకోసం కూటమి.. ఆ రెండూ వదలమంటున్న వైసీపీ!

image

ఉమ్మడి ప.గో 15 నియోజకవర్గాల్లో 2చోట్లే ఇప్పటివరకు వైసీపీ MLAలు గెలవలేదు. 2019లో 13 స్థానాల్లోనూ వైసీపీ గెలిచినా.. పాలకొల్లు(నిమ్మల), ఉండి(మంతెన రామరాజు)లో TDP జెండా ఎగిరింది. పోలవరంలో 2012(ఉప), 2019లో తెల్లం బాలరాజు వైసీపీ నుంచి 2సార్లు MLAగా గెలిచారు. మిగతా అన్నిచోట్ల వైసీపీ ఒకసారే గెలిచింది. ఈసారి జిల్లాపై పట్టుకోసం కూటమి.. పాలకొల్లు, ఉండి స్థానాలనూ వదిలేది లేదంటూ వైసీపీ వ్యూహ రచన చేస్తున్నాయి.

Similar News

News September 19, 2024

ఉమ్మడి ప.గో.జిల్లాలో కూటమి పాలనపై మీ కామెంట్..!

image

ఉమ్మడి ప.గో.జిల్లాలో అన్ని సీట్లూ గెలిచి అధికారం చేపట్టిన కూటమి సర్కారు పాలనకు రేపటితో 100 రోజులు పూర్తి కానుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని రేపటి నుంచి ఈనెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. అన్న క్యాంటీన్లు, ఉచిత ఇసుక, పింఛన్ పెంపు వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని వైసీపీ విమర్శిస్తోంది. మరి 100 రోజుల కూటమి పాలన, మీ ఎమ్మెల్యేల పనితీరుపై మీ కామెంట్..

News September 19, 2024

ఏలూరు: స్కాలర్‌షిప్ పరీక్ష దరఖాస్తు గడువు పెంపు

image

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 24 వరకు పెంచినట్లు ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం తెలిపారు. నిర్ణీత గడువులోపు ప్రభుత్వ, జడ్పీ, పురపాలక, ఎయిడెడ్, మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలల 8వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులను www.bse.ap.gov.in వెబ్ సైట్లో ఉంచామన్నారు.

News September 19, 2024

ఏలూరు: కాలువలో దిగి బాలుడు మృతి

image

ఏలూరులో ఓ బాలుడు ఆడుకుంటూ కాలువలో దిగి ఊపిరాడక మృతి చెందాడు. పట్టణంలోని గ్జేవియర్ నగర్‌కు చెందిన బాలవిజ్ఞేశ్ బుధవారం ఇంటి సమీపంలో ఉన్న ఏటిగట్టున సోదరితో కలిసి ఆడుకుంటూ కాలువలోకి దిగాడు. చిన్నారి మునిగిపోవడం చూసిన సోదరి కేకలు వేయగా స్థానికులు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం బాలుడిని వెలికితీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.