News March 25, 2025

పట్టుదలతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి: కలెక్టర్

image

పట్టుదలతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. సోమవారం సాయంత్రం మహబూబాబాద్ మండలంలోని ముత్యాలమ్మగూడెం ఆశ్రమ ఉన్నత పాఠశాల వసతిగృహం, గూడూరు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ హై స్కూల్‌ను కలెక్టర్ సందర్శించారు. విద్యార్థులకు సరైన పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలని అన్నారు. ఈకార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News January 10, 2026

అమరావతిపై YCP వైఖరి పూర్తిగా మారినట్లేనా?

image

AP: అమరావతిపై <<18817916>>సజ్జల<<>> వ్యాఖ్యలతో రాజధానిపై ఆ పార్టీ వైఖరి పూర్తిగా మారినట్లు తెలుస్తోంది. ఇటీవల జగన్ <<18799615>>కామెంట్ల<<>> తర్వాత YCP అధికారంలోకి వస్తే రాజధానిని మారుస్తారనే టాక్ విన్పించింది. 3 రాజధానుల అంశం గత ఎన్నికల్లో ప్రభావం చూపినట్లు పలుమార్లు ఆ పార్టీ నేతలు అన్నారు. ఈసారి అలా జరగకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. అందుకే జగన్ వ్యాఖ్యలపై సజ్జల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై మీరేమంటారు.

News January 10, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు..!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,145
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,013
* వెండి 10 గ్రాములు ధర రూ.2,540

* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,145
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,013
* వెండి 10 గ్రాములు ధర రూ.2,540

News January 10, 2026

మేడారం జాతరలో 3199మంది వైద్య సిబ్బంది

image

ఈ సారి మేడారం జాతరలో 3199 మంది వైద్య సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. పూర్వ వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి వీరిని నియమించుకుంటారు. మొత్తం 544 మంది వైద్యులలో 72మంది స్పెషలిస్టులు, 42మంది మహిళా డాక్టర్లు ఉంటారు. మరో 2150మంది పారామెడికల్ సిబ్బంది పని చేస్తారు. మేడారంలో 50పడకల ప్రధాన ఆస్పత్రితో పాటు 6 పడకలతో 30క్యాంపులు ఏర్పాటు చేస్తారు.