News April 11, 2025

పట్టుబడిన వాహనాలను తీసుకెళ్లండి: వరంగల్ సీపీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ఘటనల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులకు అప్పగించాలని నిర్ణయించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను హనుమకొండ భీమారం, సీఆర్‌పీఎఫ్ కేంద్రంలో భద్రపర్చారు. తగిన ఆధారాలతో వచ్చిన యజమానులకు వాహనాలను తిరిగి అందజేస్తామని సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.

Similar News

News January 5, 2026

WGL: ‘వాహనాలు రాంగ్ రూట్‌లో నడిపితే ప్రమాదమే’

image

వరంగల్ నగరంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంచే దిశగా వరంగల్ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. Safety First, Life First నినాదంతో రాంగ్ రూటులో వాహనాలు నడపొద్దు అంటూ వరంగల్ పోలీసులు తమ అఫీషియల్ ఎక్స్ (X) ఖాతాలో ప్రత్యేక పోస్టును షేర్ చేశారు. తప్పు దిశలో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతుందని, ఇది కేవలం వాహనదారులకే కాకుండా ఇతర ప్రయాణికుల ప్రాణాలకు కూడా ప్రమాదంగా మారుతుందని పోలీసులు స్పష్టం చేశారు.

News January 5, 2026

10 నిమిషాల్లోనే సమస్యకు వరంగల్ కలెక్టర్ చెక్

image

ప్రజావాణిలో 10 సంవత్సరాలు పూర్తికాని సమస్యను పది నిమిషాల్లో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పరిష్కరించారు. దరఖాస్తుదారుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి తన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మ్యుటేషన్ పెండింగ్ సమస్యపై తీవ్ర ఆవేశంతో వచ్చారు. సమస్య పరిష్కారం కావడంతో ప్రశాంతంగా వెళ్లారు. సమస్య ఏదైనా ప్రశాంతంగా పరిష్కారం అవుతుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు.

News January 4, 2026

హాల్టికెట్లలో మార్పులుంటే చేసుకోవచ్చు: డీఐఈవో

image

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్టికెట్లలో ఏవైనా మార్పులు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వరంగల్ డీఐఈవో డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఇంటర్నెట్ లో హాల్టిక్కెట్ల ప్రివ్యూను బోర్డు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నమూనా హాల్ టికెట్లలో పరిశీలించి ఏవేని మార్పులున్నట్లయితే ప్రిన్సిపాళ్లను సంప్రదించాలన్నారు. పరీక్షల నిర్వహణ తేదీల్లో ఎలాంటి మార్పులు ఉండవన్నారు.