News April 18, 2024
పట్టువదలని విశాఖ యువతి

విశాఖలోని కిర్లంపూడికి చెందిన హనిత సివిల్స్‌లో 887వ ర్యాంక్ సాధించారు. ఇంటర్ వరకు విశాఖలోనే చదివిన ఆమె 2012లో ఖరగ్‌పూర్‌లో ఇంజినీరింగ్‌లో చేరారు. 2013లో సడెన్‌గా పెరాలసిస్ రావడంతో రెండు కాళ్లు పడిపోయాయి. వీల్ ఛైర్‌కు పరిమితమైన ఆమె రెండేళ్ల పాటు డిప్రెషన్‌కి గురయ్యారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో డిస్టెన్స్‌లో డిగ్రీ పూర్తిచేసి 2020లో తొలిసారి సివిల్స్ రాశారు. నాలుగో ప్రయత్నంలో ర్యాంక్ సాధించారు
Similar News
News January 2, 2026
జనవరి 17న “స్వచ్ఛ రథం” పథకం ప్రారంభం: కలెక్టర్

గ్రామీణ ప్రాంతాల్లో పొడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాల సమర్థ నిర్వహణ లక్ష్యంగా “స్వచ్ఛ రథం” పథకాన్ని జనవరి 17న జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. గ్రామాల్లో ఉత్పత్తి అయ్యే పొడి చెత్తను సేకరించి, వస్తు మార్పిడి విధానంలో నిత్యావసర సరుకులు అందించనున్నట్లు తెలిపారు. దీంతో చెత్త వేర్పాటు అలవాటు పెరిగి గ్రామీణ పారిశుద్ధ్యం మెరుగుపడుతుందన్నారు.
News January 1, 2026
రహదారి నిబంధనలను విధిగా పాటించాలి : కలెక్టర్

రహదారిపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రహదారి నిబంధనలు పాటించాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను ప్రారంభించి, గోడ పత్రికలు, కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాల్లో 90 శాతం వరకు నిబంధనలు పాటించకపోవడమే కారణమని తెలిపారు. వాహనాలను జాగ్రత్తగా నడిపితే ప్రమాదాలను చాలా వరకు అరికట్టవచ్చన్నారు.
News December 31, 2025
VZM: రీసర్వే గ్రామాల్లో కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

జిల్లాలో రీసర్వే పూర్తైన గ్రామాల్లో రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. జనవరి 2 నుంచి 9 వరుకు అన్ని మండలాల్లో ముందుగా నిర్ణయించిన గ్రామాల్లో రెవెన్యూ గ్రామ సభల ద్వారా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పాసు పుస్తకాలు అందజేస్తామని పేర్కొన్నారు. రీసర్వే పూర్తైన గ్రామాల రైతులు గ్రామ సభలకు హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.


