News January 31, 2025

పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి దంపతులు

image

బనగానపల్లెలోని కన్యకా పరమేశ్వరి వాసవి మాత ఆలయంలో శుక్రవారం జరిగిన ఆత్మార్పణ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు మంత్రి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ఆశీర్వచనాలు అందించారు. కొండపేటలోని అమ్మవారి ఆలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇందిరమ్మ దంపతులు అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు.

Similar News

News December 9, 2025

జనగామ: ఎంపీడీవోలతో కలెక్టర్ సమీక్ష

image

తొలి విడత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై నేడు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఎంపీడీవోలతో గూగుల్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రతి మండలంలో ఓటింగ్ కేంద్రాలు, సిబ్బంది నియామకం, భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ మెటీరియల్ పంపిణీ వంటి అంశాలను వేగంగా పూర్తి చేయాలని తెలిపారు.

News December 9, 2025

తిరుపతి SVU ఫలితాల విడుదల

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ(SVU) పరిధిలో ఈ ఏడాది M.L.I.Sc(మాస్టర్ లైబ్రరీ సైన్స్ ) 1, 2 సెమిస్టర్ పరీక్షలు, దూరవిద్య విభాగం(SVU DDE) ఆధ్వర్యంలో డిగ్రీ B.A/B.Com/B.Sc చివరి సంవత్సరం పరీక్షలు జరిగాయి. సంబంధిత ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. www.manabadi.co.in ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News December 9, 2025

ధాన్యం సేకరణ వేగవంతంగా జరుగుతుంది: కలెక్టర్

image

జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరుగుతుందని, ఇప్పటివరకు 2.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 37 వేల మంది రైతులు నుంచి కొనుగోలు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన 24 గంటల్లోపుగా రూ.483.27 కోట్లు, 48 గంటల లోపుగా రూ.18.84 కోట్ల నగదు రైతుల ఖాతాల్లో జమయ్యాయని తెలిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా 90 వేల గన్నీ బ్యాగులను రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉంచామన్నారు.