News September 23, 2024

పడాల శరత్ మృతి బాధాకరం: పవన్ కళ్యాణ్

image

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు, మాజీ మంత్రి పడాల అరుణ కుమారుడు పడాల శరత్ మరణం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. శరత్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. పుత్ర శోకాన్ని తట్టుకోగల ధైర్యాన్ని అరుణ గారికి ప్రసాదించాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నానని అన్నారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రకటన విడుదల చేశారు.

Similar News

News October 9, 2024

విజయనగరంలో నేడు డయల్ యువర్ MP కార్యక్రమం

image

విజయనగరం మున్సిపల్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు డయల్ యువర్ ఎంపీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కమిషనర్ నల్లనయ్య తెలిపారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడంపై భక్తులు సలహాలు సూచనలు అందించాలని కోరారు. విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు: 9440436426, MP క్యాంప్ ఆఫీస్: 8919060911, మున్సిపల్ కమిషనర్, విజయనగరం: 9849906486 నెంబర్లను సంప్రదించాలన్నారు.

News October 9, 2024

విజయనగరం జిల్లా TODAY TOP NEWS

image

➼పార్వతీపురంలో kg టమాటా రూ.50
➼బొండపల్లి: రూ.లక్ష కరెన్సీతో అమ్మవారికి అలంకరణ
➼ అమ్మవారి ఘటాలతో పోటెత్తిన విజయనగరం
➼సిరిమాను ఉత్సవానికి పటిష్ఠ బందోబస్త్: ఎస్పీ
➼పార్వతీపురం: KGBVలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
➼డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో వీసీలో పార్వతీపురం కలెక్టర్
➼VZM: యథావిధిగా డీఎంయూ, రాయ్‌పూర్ పాసింజర్లు
➼: సచివాలయ ఉద్యోగులను మందలించిన మంత్రి కొండపల్లి

News October 8, 2024

విజయనగరం: ఉత్సవాలపై డీఐజీ సమీక్ష

image

ఈనెల 13,14,15 తేదీల్లో జరిగే విజయనగర ఉత్సవాలు, శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర నేపథ్యంలో.. భద్రత, బందోబస్తు ఏర్పాట్లను విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌తో కలిసి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని భద్రతా చర్యలు చేపట్టాలన్నారు.