News November 25, 2024

పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. వణికిస్తున్న చలి!

image

నల్గొండ జిల్లాలో చలి పంజా విసురుతుంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గిపోతుండటంతో ప్రజలు చలిమంటలు కాచుకోక తప్పడం లేదు. గత రెండు మూడు రోజులుగా జిల్లాలో 19 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  అటు పలు ప్రాంతాల్లో పొగ మంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.  చలి తీవ్రత కారణంగా వృద్ధులు, పిల్లలు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

Similar News

News December 14, 2024

NLG: మామపై దాడి.. కోడలికి రిమాండ్ 

image

వృద్ధుడు, దివ్యాంగుడైన మామపై <<14828145>>చెప్పుతో దాడి<<>> చేసిన ఘటనలో అతని కోడలిని రిమాండ్‌కు తరలించినట్లు వేములపల్లి ఎస్‌ఐ డి.వెంకటేశ్వర్లు తెలిపారు. గత నెల 20న భూ వివాదంలో శెట్టిపాలెంకి చెందిన గగినపల్లి బుచ్చిరెడ్డిపై అతడి కోడలు మణిమాల చెప్పుతో దాడి చేసింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. స్పందించిన పోలీసులు విచారణ చేపట్టి మణిమాలను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేసినట్లు తెలిపారు.

News December 14, 2024

తెలంగాణ- ఆంధ్ర చెక్‌పోస్టు వద్ద భారీ బందోబస్తు 

image

కోదాడ మండల పరిధిలోని రామాపురం క్రాస్ రోడ్డులో ఆంధ్ర – తెలంగాణ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు సన్న వడ్లకు బోనస్ ధర ఇస్తున్నందున ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు చేపడుతున్నారు. రెవెన్యూ, మైనింగ్, పోలీస్, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొంటున్నారు. 

News December 13, 2024

భువనగిరి ఒక్కటే మిగిలింది!

image

త్వరలో క్యాబినెట్ విస్తరణ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఉమ్మడి నల్గొండ నుంచి ప్రస్తుతం ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ ఉన్నారు. ఈ లెక్కన నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుంచి మంత్రి పదవి లభించినట్లైంది. ఇక భువనగిరి జిల్లా మాత్రమే మిగిలుండగా బెర్తు దక్కుతుందో లేదో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.