News October 31, 2024
పత్తికొండలో కిలో టమాటా రూ.8

టమాటా ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. వారం క్రితం కిలో రూ.50కి పైగా అమ్ముడుపోగా ప్రస్తుతం భారీగా పడిపోయాయి. పత్తికొండ టమాటా మార్కెట్లో నిన్న కిలో రూ.5 నుంచి రూ.8 వరకు పలకడం విశేషం. క్వింటా గరిష్ఠంగా రూ.800, కనిష్ఠంగా రూ.500తో విక్రయాలు జరిగాయి. ధరలు పతనం అవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీ ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు.
Similar News
News November 17, 2025
విద్యుత్ సామర్థ్యాన్ని పెంచడంలో గ్రీన్ స్టోరేజ్ కీలకం: కేంద్రమంత్రి

కర్నూలు జిల్లా పాగిడియాల మండలంలో గ్రీన్కో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ పవర్ పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులకు ప్రాజెక్టు పురోగతిపై ఆయన అవగాహన కల్పించారు. అవసరమైన విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని పెంచడంలో ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి అన్నారు.

కర్నూల్ ఎస్పీ PGRSకు 84 ఫిర్యాదులు

కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి మొత్తం 84 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఫిర్యాదుదారుల సమస్యలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఫిర్యాదులపై విచారణ చేసి, చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. అందిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.