News April 28, 2024
పత్తికొండ: ఆర్డీటీ సెట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ప్రభుత్వ పాఠశాలలో చదివి పదో తరగతి స్టేట్ సిలబస్‌లో 500 మార్కులు, సెంట్రల్ సిలబస్‌లో 420 మార్కులు సాధించిన విద్యార్థులు ఆర్డీటీ సెట్ 2024కు దరఖాస్తు చేసుకోవాలని ఏరియా టీం లీడర్ రెహనా తెలిపారు. అర్హులైన విద్యార్థులు మే 4వ తేదీ నుంచి 10 వరకు దరఖాస్తులను ఆర్డీటీ కార్యాలయంలో అందజేయాలని, మే 19న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు యశోద గార్డెన్‌లోని ఆర్డీటీ ఆఫీసును సంప్రదించాలన్నారు.
Similar News
News November 11, 2025
ఢిల్లీలో పేలుడు.. అప్రమత్తమైన కర్నూలు పోలీసులు

ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడు నేపథ్యంలో కర్నూల్ వ్యాప్తంగా అప్రమత్తతా చర్యలు ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పోలీసు బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. కర్నూలు, గుత్తి పరిధిలోని పెట్రోల్ బంకులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, టోల్ గేట్లు, రద్దీ ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులను పరిశీలించారు.
News November 11, 2025
హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుకు భూమిని గుర్తించండి: మంత్రి

హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుకు భూమిని గుర్తించాలని అధికారులను మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుకు భూమి గుర్తింపు అంశంపై కలెక్టర్ సిరితో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
News November 10, 2025