News April 9, 2025

పత్తికొండ: మీ ఊర్లో నీటి సమస్య ఉందా.. ఫోన్ చేయండి!

image

పత్తికొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తితే తమకు తెలియజేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారి భరత్ నాయక్ ప్రజలను కోరారు. పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, క్రిష్ణగిరి, ఆలూరు, హాళహార్వి, ఆస్పరి, దేవనకొండ మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు హెల్ప్ లైన్ నంబర్ 8520796952కు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 వరకు నీటి సమస్యపై ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు.

Similar News

News April 20, 2025

కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుల అరెస్ట్

image

మంగళగిరిలో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మున్నా ఫరూక్ హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సిరివెళ్ల సీఐ దస్తగిరి బాబు, ఎస్సై చిన్నపీరయ్య తెలిపారు. నంద్యాలకు చెందిన షేక్ షబ్బీర్ బాషా ప్రియురాలిపై కానిస్టేబుల్ ఫరూక్ అసభ్యంగా ప్రవర్తించాడన్న కోపంతో హత్య చేశారని తెలిపారు. మృతదేహాన్ని గిద్దలూరు అటవీ ప్రాంతంలో పడేశారని వివరించారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

News April 20, 2025

ఆదోని మెడికల్ కాలేజీపై ఆరోగ్యశాఖ మంత్రి స్పందన

image

కర్నూలు జీజీహెచ్‌లో అవసరమైన ఐపీ బ్లాక్ నిర్మిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యులు, సిబ్బందితో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. నిర్మాణ దశలో ఉన్న క్రిటికల్ కేర్ బ్లాక్‌ను త్వరలోనే పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామన్నారు. ఆదోని మెడికల్ కాలేజీని అన్ని వసతులతో వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.

News April 19, 2025

error: Content is protected !!