News January 10, 2026
పత్తి కట్టెలను నేలలో కలియదున్నితే కలిగే లాభాలివే..

పత్తి ఏరిన తర్వాత ఎకరాకు దాదాపు 10- 30 క్వింటాళ్ల పత్తి కట్టె మిగులుతుంది. వీటిని భూమిలో కలియదున్నితే ఎకరాకు 5-30 KGల నత్రజని, పొటాషియం పోషకాలతో పాటు పంటకు మేలు చేసే సూక్ష్మజీవులను నేలకు అందజేయవచ్చు. దీని వల్ల తర్వాతి పంటల్లో రసాయన ఎరువుల మోతాదు తగ్గి ఖర్చు ఆదా అవుతుంది. నేలలో తగ్గుతున్న వానపాములను, సూక్ష్మజీవులను రక్షించవచ్చు. నేలకు నీటిని పట్టి ఉంచే సామర్థ్యం కూడా పెరుగుతుంది.
Similar News
News January 15, 2026
బంగ్లా క్రికెట్‌లో తిరుగుబాటు: బోర్డు డైరెక్టర్ రాజీనామాకు డిమాండ్!

BCB డైరెక్టర్ నజ్ముల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ దేశ క్రికెట్‌లో చిచ్చు రేపాయి. T20 వరల్డ్ కప్ నుంచి తప్పుకొంటే ఆటగాళ్లకు నష్టపరిహారం చెల్లించబోమని అనడంపై క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నజ్ముల్ వెంటనే రాజీనామా చేయాలని, లేనిపక్షంలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించారు. వివాదం ముదరడంతో స్పందించిన బోర్డు, ఆ వ్యాఖ్యలు తమ అధికారిక వైఖరి కాదంటూ విచారం వ్యక్తం చేసింది.
News January 15, 2026
MOIL లిమిటెడ్‌లో 67 పోస్టులు.. అప్లై చేశారా?

<
News January 15, 2026
సంక్రాంతి అల్లుడికి 158 రకాల వంటకాలతో విందు

AP: గోదావరి జిల్లాలను మరిపించేలా ఈసారి తెనాలి వాసులు అల్లుడికి 158 రకాల వంటకాలతో అదిరిపోయే ఆతిథ్యం ఇచ్చారు. తెనాలికి చెందిన మురళీకృష్ణ తన కుమార్తె మౌనికను రాజమండ్రికి చెందిన శ్రీదత్తకు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లైన తర్వాత వచ్చిన తొలి సంక్రాంతి కావడంతో అల్లుడికి కళ్లు చెదిరే విందు ఏర్పాటు చేశారు. రకరకాల పిండి వంటలు, ఫలహారాలు, పండ్లతో భోజనం వడ్డించి ఆశ్చర్యపరిచారు.


