News February 16, 2025

పత్తి కొనుగోలు మోసగాళ్లను పట్టుకున్న గ్రామస్తులు

image

తాడ్వాయి మండలంలో పత్తి కొనుగోలు మోసగాళ్లని గ్రామస్తులు పట్టుకున్నారు. మండలంలోని బీరెల్లి గ్రామంలో ఖమ్మం జిల్లా జూలూరుపాడు నుంచి కొంతమంది పత్తి ఎక్కువ రేటుకు కొనుగోలు చేస్తామని వచ్చారు. వారు తెచ్చిన కాంటాలలో 100kgల పత్తి 60kgలు చూపిస్తుంది. గమనించిన రైతులు వారిని పట్టుకొని తాడ్వాయి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Similar News

News October 19, 2025

MSMEలకు మద్దతు ఇవ్వడం లక్ష్యం: మంత్రి

image

MSMEలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా జర్మనీ పారిశ్రామిక వేత్తలతో కీలక సమావేశమైనట్లు మంత్రి కొండపల్లి తెలిపారు. జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్‌లో చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీతో కీలక సమావేశం జరిగిందన్నారు. వివిధ కంపెనీలకు చెందిన 30 మంది CEOలతో పెట్టుబడుల సమావేశం నిర్వహించానని, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు వివరించానన్నారు. నవంబర్‌లో విశాఖలో జరిగే CII సదస్సుకు వారిని ఆహ్వానించినట్లు తెలిపారు.

News October 19, 2025

మంచిర్యాల: ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సంబంధిత అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులు, ఆస్తిపన్నులు వసూలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మునిసిపల్ పరిధిలో ఆస్తిపన్ను 100% వసూలు చేయాలన్నారు.

News October 19, 2025

మెదక్: అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్‌గా సుశాంత్ గౌడ్ ఎంపిక

image

గ్రూప్-2 పరీక్షల్లో మెదక్ పట్టణానికి చెందిన మంగ నారా గౌడ్, ఇందిర దంపతుల తనయుడు సుశాంత్ గౌడ్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. “ప్రజాపాలనలో కొలువుల పండుగ” కార్యక్రమంలో భాగంగా గ్రూప్-2 సర్వీసులకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంఛనంగా నియామక పత్రాలను అందజేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సుశాంత్ గౌడ్ ముఖ్యమంత్రి చేతుల మీదగా ఉత్తర్వులు అందుకున్నారు.