News March 5, 2025

పత్రాల జారీలో జాప్యాన్ని నివారించండి: నంద్యాల కలెక్టర్

image

జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం లేకుండా నిర్ణీత కాల వ్యవధిలోగా అందజేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి వైద్యాధికారులు, మున్సిపల్ కమీషనర్లు, పంచాయతీ అధికారులను ఆదేశించారు. మంగళవారం నంద్యాల కలెక్టర్ ఛాంబర్‌లో జనన మరణ పత్రాల జారీపై ఇంటర్ డిపార్ట్‌మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు.

Similar News

News November 28, 2025

సర్పంచ్ ఎన్నికలపై స్టే విధించలేం: హైకోర్టు

image

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన <<18403510>>జీవో 46ను<<>> సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ దశలో సర్పంచ్ ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక కోర్టుల జోక్యం ఉండదన్న ఈసీ తరఫు లాయర్ల వాదనలతో ఏకీభవించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను 2 నెలలకు వాయిదా వేసింది.

News November 28, 2025

కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్‌పై రేప్ కేసు నమోదు

image

కేరళ పాలక్కాడ్ కాంగ్రెస్ MLA రాహుల్ మామ్‌కూటత్తిల్‌పై అత్యాచార కేసు నమోదైంది. ఆయన తనను రేప్ చేసి గర్భం దాల్చాక అబార్షన్ చేయించుకోవాలని బెదిరించాడని ఓ యువతి CM విజయన్‌కు ఫిర్యాదు చేశారు. వీరిద్దరి మధ్య ఆడియో రికార్డులు, చాటింగ్ స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే తాను ఏ తప్పూ చేయలేదని, చట్టపరంగా కేసును ఎదుర్కొంటానని MLA చెప్పారు. కాగా రాహుల్‌ ప్రాథమిక సభ్యత్వాన్ని INC రద్దు చేసింది.

News November 28, 2025

HYD: సామన్లు సర్దుకున్న పెద్దాయన!

image

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అక్రమాలకు పాల్పడిన పెద్దాయన సామన్లు సర్దుకున్నట్లు టాక్. హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలోని విలువైన వస్తువులను, ఫర్నిచర్లను తన ఇంటికి తరలించారు. అక్ర‘మార్కుల’ కేసులో వేటు తప్పదనే ఉద్దేశ్యంతో తన క్యాంపు కార్యాలయాల్లోని సామగ్రిని గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారని సమాచారం.