News March 21, 2025

పత్రికల్లో కథనాలు తప్పా? నివేదికలు తప్పా?: సీతక్క

image

గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఉన్నాయని పత్రికలు, సోషల్ మీడియాలో వచ్చే తప్పా..? తప్పా? ఏ సమస్యలు లేవంటూ అధికారులు ఇస్తున్న నివేదికలు తప్పా? అని మంత్రి సీతక్క అధికారులను ప్రశ్నించారు. ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ కార్యాలయంలో మంత్రి సీతక్క ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని ఈ సందర్భంగా అధికారులకు ఆమె స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

Similar News

News October 17, 2025

ఇలా అయితే.. సిటీ మూసీలోకే: రఘునందన్‌రావు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని పేర్కొన్నారు. కన్నీళ్లతో ఒకరు ప్రచారానికి వస్తే.. కట్టెలు తీసుకొని ఇంకొకరు వస్తున్నారన్నారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు వచ్చినా సిటీ మూసీలో కలవాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. 

News October 17, 2025

HYD: ECకి నేరచరిత్ర చెప్పని అభ్యర్థులు

image

ఎన్నికల సమయంలో కచ్చితంగా నేర చరిత్ర ఎన్నికల సంఘానికి చెప్పాలి.. అయితే ఇప్పటి వరకు కొందరు అభ్యర్థులు తమ నేరచరిత్రను చెప్పలేదు. లోక్‌సభ ఎన్నికల్లో HYD నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్లో ఏడుగురికి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. అయితే ఇప్పటి వరకు కేవలం నలుగురు మాత్రమే వివరాలు సబ్మిట్ చేశారు. ఇక చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల్లో ఏడుగురికి నేరచరిత్ర ఉంటే ముగ్గురే వివరాలు అందించారు.

News October 17, 2025

కేబినెట్ సబ్ కమిటీకి మెట్రో కమిటీ నివేదిక

image

హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే మెట్రో కమిటీ తన నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వనుంది. మెట్రో కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ సబ్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి నిపుణులతో మాట్లాడుతుంది. సాధ్యాసాధ్యాలపై కూలంకుశంగా విచారించి ఓ నిర్ణయం తీసుకుంటుంది. దానిపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ తతంగం సాధ్యమైనంత తొందరగా పూర్తిచేయాలని సర్కారు భావిస్తోంది.