News July 14, 2024

పథకం ప్రకారమే భార్య, పిల్లల హత్య: ఏసీపీ

image

రఘునాథపాలెం: హర్యాతండ వద్ద మే 28న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆదివారం ACP రమణమూర్తి వివరాలు వెల్లడించారు. బాబాజీతండాకు చెందిన నేరస్తుడు బోడ ప్రవీణ్ HYDలో వైద్యుడిగా పని చేస్తూ కేరళకు చెందిన యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వీరి అక్రమ సంబంధానికి భార్య పిల్లలు అడ్డు వస్తున్నారన్న నేపంతో భార్య పిల్లలను హత్య చేసి, రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు చిత్రీకరించాడని పేర్కొన్నారు.

Similar News

News October 13, 2024

ఎర్రుపాలెం: వృద్ధ దంపతుల ఆత్మహత్య

image

ఎర్రుపాలెం మండల కేంద్రంలో వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

News October 13, 2024

భద్రాచలంలో పేలిన గ్యాస్ సిలిండర్

image

భద్రాచలం పట్టణంలోని హోటల్ గీతాంజలి వీధిలో ఉన్న ఓ ఇంట్లో మహిళ దీపారాధన చేసింది. అనంతరం ఆరుబయట పనిచేస్తూ ఉండగా గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదానికి గురైంది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కాగా ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేశారు.

News October 13, 2024

కల్లోజి జయమ్మ మృతి పట్ల ఎంపీ సంతాపం

image

సీనియర్ జర్నలిస్టు, టీయూడబ్ల్యూజే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కల్లోజి శ్రీనివాస్ మాతృమూర్తి కల్లోజి జయమ్మ ఆదివారం తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె మరణవార్త తెలిసి.. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తల్లిని కోల్పోయి దు:ఖంలో ఉన్న శ్రీనివాస్ కు ఎంపీ రవిచంద్ర ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు.