News February 16, 2025
పథకాలను లఘుచిత్రాల ద్వారా ప్రచారం చేయాలి: భట్టి

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ పథకాలను లఘుచిత్రాల ద్వారా ప్రచారం చేయాలని… వాటికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు. డిజిటల్ భూసర్వేకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలని అన్నారు.
Similar News
News March 19, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు ∆} సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం.
News March 19, 2025
సత్తుపల్లి: హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

వ్యక్తిని గొడ్డలితో నరికి చంపిన కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ సత్తుపల్లి 6వ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం.శ్రీనివాస్ తీర్పు చెప్పారు. పాతకక్షల నేపథ్యంలో 2023 ఫిబ్రవరి 19న కల్లూరు మండలం చెన్నూరుకు చెందిన పాటిబండ్ల శ్రీనివాసరావును అదే గ్రామానికి చెందిన బంధువు పాటిబండ్ల శివ రోడ్డుపై కత్తితో హత్య చేయగా నేరం రుజువు కాగా తీర్పునిచ్చారు. దీంతో పోలీస్ సిబ్బందిని సీపీ సత్కరించారు.
News March 19, 2025
ఖమ్మం: ఓటు నమోదుకు 4,734 దరఖాస్తులు

ఖమ్మం జిల్లాలో ఫారం 6 క్రింద 4,734 దరఖాస్తులు రాగా, 3,267 నూతన ఓటర్లను నమోదు చేశామని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇందులో 943 దరఖాస్తులు తిరస్కరించామని, 550 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అలాగే జిల్లాలో 1,459 పోలింగ్ కేంద్రాలకు గాను ఈవీఎం గోడౌన్‌లో 5,824 బ్యాలెట్ యూనిట్లు, 2,202 కంట్రోల్ యూనిట్‌లు, 2,218 వివి ప్యాట్‌లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.