News August 5, 2024
పథకాలు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు: తమ్మినేని

రాష్ట్రంలో రాజ్యాంగ పరిపాలన పోయి, రెడ్ బుక్ పాలన ఆవిష్కృతమైందని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సంక్షేమంలో పరుగులు తీస్తున్న రాష్ట్రాన్ని ఒక్కసారిగా సంక్షోభంలోకి నెట్టేశారని మండిపడ్డారు. పథకాలు పూర్తిస్థాయిలో అందక ప్రజలు అల్లాడుతున్నారని చెప్పారు. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా నేతలను వేధింపులకు గురి చేయడం తగదన్నారు.
Similar News
News February 25, 2026
శ్రీకాకుళం: రెండు వారాల వ్యవధిలో ఇద్దరు కమిషనర్లు అవుట్..!

శ్రీకాకుళం నగరపాలక సంస్థ పాలనా యంత్రాంగం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. రెండు వారాల వ్యవధిలో ఇద్దరు కమిషనర్లపై వేటు పడింది. ఒకరు బదిలీ కాగా.. మరొకరిపై సస్పెన్షన్ వేటు పడింది. గతంలో నగర పాలక సంస్థ కమిషనర్‌గా పనిచేసిన దుర్గా ప్రసాద్ రెండు వారాల కిందట ఆకస్మికంగా బదిలీపై వెళ్లారు. ప్రస్తుత కమిషనర్ కూర్మారావు వచ్చి 2 వారాలు గడవక ముందే డయేరియా నేపథ్యంలో సస్పెన్షన్ ఎదుర్కొన్నారు.
News February 25, 2026
శ్రీకాకుళంలో వ్యక్తి ఆత్మహత్య

శ్రీకాకుళంలోని వాంబే కాలనీలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ ఎస్ఐ హరికృష్ణ వివరాల ప్రకారం.. యడగళ్ల పవన్ కుమార్ (27) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో పలు చోట్ల వెతికారు. బుధవారం ఉదయం నివాసం సమీపంలోని ఇదే సముదాయంలోని 17వ నంబరు బ్లాక్‌లో ఖాళీగా ఉన్న ఇంటిలో ఉరి వేసుకొని ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 25, 2026
ఎచ్చెర్ల: డిగ్రీ 6వ సెమిస్టర్ షెడ్యూల్ విడుదల..

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో గల డిగ్రీ 6వ సెమిస్టర్ షెడ్యూల్‌ను డీన్ డా.అనురాధ విడుదల చేశారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఎటువంటి అపరాధరుసుము లేకుండా పరీక్ష ఫీజును చెల్లించవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా ఇంటర్న్ షిప్, వైవా మార్చి 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు.


