News January 27, 2025
పథకాల పంపిణీపై ఉద్యోగుల సేవలు భేష్: BPL కలెక్టర్

భూపాలపల్లి జిల్లాలో నాలుగు పథకాల జారీ ప్రక్రియలో భాగస్వాములైన గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారుల అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. సోమవారం అన్ని శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి, మాట్లాడారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.
Similar News
News November 19, 2025
HEADLINES

* మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా ఎన్‌కౌంటర్
* ఏపీలో మావోయిస్టుల కలకలం.. 50 మందికిపైగా అరెస్ట్
* పుట్టపర్తి సత్యసాయి శత జయంతి సందర్భంగా రేపు ఏపీకి PM మోదీ
* డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం: TTD
* 2015 గ్రూప్-2 పరీక్ష ఫలితాలను రద్దు చేసిన TG హైకోర్టు
* TGలో వాట్సాప్‌లో ‘మీ-సేవ’లు ప్రారంభం
* భారీగా తగ్గిన బంగారం ధరలు
News November 19, 2025
టీవీ ఛానెళ్లకు కేంద్రం హెచ్చరిక

సున్నితమైన, రెచ్చగొట్టే కంటెంట్ ప్రసారంపై TV ఛానెళ్లకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ఎర్రకోట పేలుడు సహా ఇటీవలి ఘటనలకు సంబంధించిన సమాచార ప్రసారానికి దూరంగా ఉండాలని కోరింది. కొన్ని ఛానెళ్లు హింసను ప్రేరేపించేలా, శాంతికి భంగం కలిగించేలా, దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా వీడియోలు టెలికాస్ట్ చేశాయని పేర్కొంది. ఇది చట్టవిరుద్ధమని, అలాంటి కార్యకలాపాలను ప్రోత్సహించే దృశ్యాలను ప్రసారం చేయొద్దని సూచించింది.
News November 19, 2025
భీమవరం: వరల్డ్ టాయిలెట్ డే గోడ పత్రిక ఆవిష్కరణ

ఈనెల 19న వరల్డ్ టాయిలెట్ డే పురస్కరించుకొని మంగళవారం భీమవరం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో వరల్డ్ టాయిలెట్ డే గోడ పత్రికను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బహిరంగ మలమూత్ర విసర్జన చేయకపోవడం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన కారణంగా ప్రజలు, జంతువులు ఎన్నో వ్యాధులకు గురి అవుతున్నాయని తెలిపారు.


