News March 20, 2025
పదవ తరగతి పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ ప్రతీక్

పదవ తరగతి పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ నుంచి డీఈవో రేణుక దేవితో కలిసి కలెక్టర్ పరీక్షల నిర్వహణ అధికారులతో తహసీల్దారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. ఎలాంటి మాస్ కాఫింగు అవకాశం లేకుండా చూడాలన్నారు.
Similar News
News October 18, 2025
ఎడపల్లి వాసి నేత్ర దానం

ఎడపల్లిలో శుక్రవారం మృతి చెందిన కంటేడి గంగాధర్(60) నేత్ర దానం చేశారు. మృతి చెందిన అనంతరం నేత్రాలను నేత్రదానం చేయాలని ఆయన కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు నేత్రాలను దానం చేశారు. తన మృతి అనంతరం ఇంకొకరికి చూపును ప్రసాదించే సంకల్పంతో నేత్రదానం చేయాలని కుటుంబ సభ్యులకు గంగాధర్ సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
News October 18, 2025
సీజ్‌ఫైర్‌కు తూట్లు.. అఫ్గాన్‌పై పాక్ ఎయిర్ స్ట్రైక్స్

పాక్-అఫ్గాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని దోహాలో చర్చలు ముగిసే వరకు పొడిగించారు. కానీ, పాక్ మాత్రం పక్టికా ప్రావిన్స్‌లోని అర్గున్, బర్మాల్ జిల్లాల్లో నివాస ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రైక్స్ చేసినట్లు ‘TOLO NEWS’ పేర్కొంది. దీనిని తాలిబన్ సీనియర్ లీడర్ ఖండించారు. ‘పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. మేము కచ్చితంగా బుద్ధి చెప్తాం’ అని పేర్కొన్నారు.
News October 18, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 18, శనివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.57 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.10 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.15 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.52 గంటలకు
✒ ఇష: రాత్రి 7.05 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.