News March 13, 2025
పదవ తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

ఈ నెల 17 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు జరిగే పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టీ.ఎస్. చేతన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, స్థానిక మండల అధికారులతో ముందస్తు ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పరీక్ష కేంద్రాలకు నూరు మీటర్ల పరిధిలో వరకు 144 సెక్షన్ విధించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
Similar News
News March 14, 2025
NGKL: హోలీ పండుగ వేళ విషాదం.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

హోలీ పండుగ వేళ బిజినేపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వెలుగొండకు చెందిన రమేశ్(38) స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనంపై బుద్దారంగండి నుంచి బిజినేపల్లికి వస్తున్నాడు. ఈ క్రమంలో శాయిన్‌పల్లిలో స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపు తప్పడంతో రమేశ్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరొకరికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రమేశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు.
News March 14, 2025
‘జియో హాట్‌స్టార్’ కీలక నిర్ణయం.. వారికి షాక్?

జియో, స్టార్ నెట్‌వర్క్, కలర్స్ టీవీల ప్రోగ్రామ్స్‌ను చాలామంది యూట్యూబ్‌లో చూస్తుంటారు. వారికి ‘జియో హాట్‌స్టార్’ షాకివ్వనుంది. ఆ సంస్థ యూట్యూబ్‌లో ఉన్న కంటెంట్‌ను తొలగించనుందని ‘ది ఎకనమిక్ టైమ్స్’ ఓ కథనంలో తెలిపింది. దాని ప్రకారం.. తమ యాప్, శాటిలైట్ టీవీల్లో తప్ప వేరే ఏ స్ట్రీమింగ్ వేదికపైనా తమ కంటెంట్ రాకూడదని జియో హాట్‌స్టార్ భావిస్తోంది. యాప్‌లో చూడాలంటే పేమెంట్ చేయాల్సి ఉంటుందని సమాచారం.
News March 14, 2025
అనకాపల్లి జిల్లాలో టుడే టాప్ న్యూస్

➤ నాతవరంలో ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి
➤ రిపోర్టర్‌ను బెదిరించి సెల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లిన దుండగులు
➤ సముద్ర స్నానానికి వెళ్లిన ఉపమాక వెంకన్న
➤ ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. పిఠాపురం తరలి వెళ్లిన జనసైనికులు
➤ వడ్డాది వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
➤ నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా-ఎలమంచిలి MLA
➤ 21న గోవాడ షుగర్ ఫ్యాక్టరీ సమస్యలపై ధర్నా
➤ హోలీ ఉత్సవాల్లో చిన్నారుల సందడి