News March 13, 2025

పదవ తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఈ నెల 17 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు జరిగే పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టీ.ఎస్. చేతన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, స్థానిక మండల అధికారులతో ముందస్తు ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పరీక్ష కేంద్రాలకు నూరు మీటర్ల పరిధిలో వరకు 144 సెక్షన్ విధించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

Similar News

News March 26, 2025

గాజువాకలో యువకుడి సూసైడ్ 

image

గాజువాక మండలం B.C రోడ్డులోని వాంబేకాలనీలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న పవన్(21) ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఆర్థిక పరిస్థితులే కారణంగా చనిపోతున్నట్లు మృతుడు సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

News March 26, 2025

అప్సర హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు

image

TG: సంచలనం రేపిన <<10880696>>అప్సర<<>> హత్య కేసులో రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఆమెను హత్య చేసిన నిందితుడు పూజారి సాయికృష్ణకు జీవితఖైదు విధించింది. కొన్నేళ్లుగా అప్సర అనే మహిళతో వివాహేతర సంబంధం నడిపిన సాయికృష్ణ 2023లో ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మ్యాన్‌హోల్‌లో పడేసి, అప్సర కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడిపై అనుమానం రావడంతో దర్యాప్తు చేపట్టగా సాయికృష్ణే నిందితుడని తేలింది.

News March 26, 2025

అడుగుకు ‘రూపాయి పావలా’ కమీషన్ వసూలు: YCP

image

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై వైసీపీ మరోసారి సంచలన ఆరోపణ చేసింది. ‘నిన్న మొన్నటివరకు చికెన్ షాప్‌ల మీద పడి దండుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇప్పుడు పొగాకు గోదాములను కూడా వదలడం లేదు. అడుగుకు ‘రూపాయి పావలా’ చొప్పున తనకు రౌడీ మాములు ఇస్తే తప్ప అక్కడ పొగాకు నిల్వ చేయనివ్వమని హెచ్చరించారు. ఎమ్మెల్యే దిగజారుడుతనం చూసి వ్యాపారులు భీతిల్లుతున్నారు’ అంటూ ట్వీట్ చేసింది.

error: Content is protected !!