News March 19, 2025
పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

చిత్తూరు నగరంలోని మున్సిపల్ హైస్కూల్‌లో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు బుధవారం పరిశీలించారు. చిత్తూరు జిల్లా అంతట పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని రకాల భద్రత చర్యలను ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News December 4, 2025
చిత్తూరు: టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్ నియమిస్తామని డీఈవో వరలక్ష్మి చెప్పారు. జిల్లాలో 34 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. స్కూల్ అసిస్టెంట్లకు నెలకు రూ.12,500, ఎస్జీటీలకు రూ.10 వేలు జీతం ఉంటుందన్నారు.
News December 4, 2025
చిత్తూరు జిల్లాలో CIల బదిలీ

చిత్తూరు జిల్లాలో ముగ్గురు సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పలమనేరు అర్బన్ సీఐ కె.మురళీమోహన్‌ను స్పెషల్ బ్రాంచ్ సీఐగా బదిలీ చేశారు. పూతలపట్టు అర్బన్ సీఐ కృష్ణ మోహన్‌ను వీఆర్‌కు పంపారు. చిత్తూరులో వీఆర్‌లో ఉన్న డి.గోపిని పూతలపట్టు అర్బన్ సీఐగా నియమించారు.
News December 4, 2025
రాష్ట్ర స్థాయి విజేతలుగా చిత్తూరు దివ్యాంగ క్రీడాకారులు

గుంటూరులో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో దివ్యాంగుల (పారా స్పోర్ట్స్)పాఠశాల బ్యాడ్మింటన్ మీట్‌లో రాష్ట్ర స్థాయి క్రీడలను నిర్వహించారు. డిసెంబర్ 1, 2వ తేదీల్లో నిర్వహించిన ఈ క్రీడల్లో చిత్తూరు దివ్యాంగ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా బుధవారం రాష్ట్ర స్థాయి క్రీడాకారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తన ఆఫీసుకు ఆహ్వానించి పుష్పగుచ్చం అందజేసి అభినందించారు.


