News March 20, 2025

పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS: వరంగల్ సీపీ

image

ఈనెల 21 నుంచి పదవ తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద ఏప్రిల్ 4 వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్-2023(144 సెక్షన్) అమలులో ఉంటుందని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు ఐదు వందల మీటర్ల దూరం వరకు ఇద్దరికి మించి గుంపులుగా ఉండొద్దని సీపీ సూచించారు.

Similar News

News April 19, 2025

పెనుకొండలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలోని భారత్ పెట్రోల్ బంకు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటు చసుకొంది. ప్రమాదంలో కారు, బైకు ఢీకొనడంతో ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించినట్లు వారు వివరించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 19, 2025

కోవెలకుంట్లలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

image

యువకుల ప్రాణాలను హరించే క్రికెట్ బెట్టింగ్‌పై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ కే.ప్రమోద్ పేర్కొన్నారు. శనివారం కోవెలకుంట్లలో అదుపులోకి తీసుకున్న క్రికెట్ బెట్టింగ్ ముఠా సభ్యులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. సీఐ హనుమంతు నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు ఆరుగురు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకొని రూ.4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ప్రమోద్ వివరించారు.

News April 19, 2025

ఉండి: మహిళ మెడలో గొలుసు అపహరణ

image

ఉండి రాజుల పేటలో ఉంటున్న అగ్ని మాత్రం వరలక్ష్మి మెడలోని 4 కాసుల బంగారు తాడును శనివారం గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. వరలక్ష్మి గత పది సంవత్సరాలుగా ఉండిలో నివాసం ఉంటుంది. శనివారం వేకువజామున 3 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి డోర్ తీసుకొని వచ్చి అటు ఇటు చూస్తుండగా వరలక్ష్మి ఎవరు అని అడగగా, తన నోరునొక్కి మెడలోని బంగారు తాడును లాక్కెళ్లాడు. పోలీసులు విచారణ చేపట్టారు.

error: Content is protected !!