News March 29, 2025
‘పది’ జవాబు పత్రాలు సురక్షితంగా ఉన్నాయి: ఖమ్మం DEO

కారేపల్లి మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రంలో నిర్వహించిన SSC మార్చి-2025కు సంబంధిన భౌతిక, రసాయన శాస్త్రం జవాబు పత్రాలను తపాలా శాఖ వారు తరలిస్తుండగా జారి కింద పడడం జరిగింది. కాగా ఆ పరీక్ష జవాబు పత్రాలు సురక్షితంగానే ఉన్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ వర్మ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.
Similar News
News December 27, 2025
అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం: సీపీ సునీల్ దత్

ఖమ్మం జిల్లాలో అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాల కట్టడికి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు CP సునీల్ దత్ తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి గంజాయి, ఇసుక, రేషన్ బియ్యం తరలించే ముఠాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఇందులో భాగంగా తనిఖీలను ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని, అలాగే డ్రంక్&డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశామన్నారు.
News December 27, 2025
ప్రయాణికులకు ఊరట.. ఖమ్మం మీదుగా 10 ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఖమ్మం మీదుగా మొత్తం పది ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు స్టేషన్ చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ డి.రాజగోపాల్ వెల్లడించారు. ఇందులో ఐదు రైళ్లు ఖమ్మం మీదుగా రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారు. జనవరి 9 నుంచి 20 వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.
News December 27, 2025
ఖమ్మం: ఇయర్ ఎండింగ్ ఎఫెక్ట్.. తగ్గిన రిజిస్ట్రేషన్లు

ఖమ్మం రవాణాశాఖ ఆఫీస్లో రోజుకు 50 నుంచి 60 వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. కానీ గత ఐదు రోజులుగా ఈ రద్దీ సగానికి పైగా తగ్గింది. కొత్త సంవత్సరం, సంక్రాంతి సమయంలో వాహనాలు కొనవచ్చని చాలా మంది వేచి చూస్తుంటారు. అంతే కాకుండా వాహనాల షోరూంలు పలు ఆఫర్లు ప్రకటించి విక్రయాలు జరుపుతుంటాయి. దీంతో ఆ ప్రభావం రవాణా శాఖపై పడింది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆర్డీవో ఆఫీస్, కేఎంసీ రహదారి ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తోంది.


