News January 30, 2025
పది తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: నిర్మల్ DEO

మండలంలోని అనంతపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాధికారి రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, తరగతుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, తదితరులున్నారు.
Similar News
News February 13, 2025
IPL.. RCB ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్

RCB ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి. ఆ జట్టు కెప్టెన్ ఎవరో రేపు తేలిపోనుంది. గురువారం ఉ.11.30 గంటలకు ఆ జట్టు తమ కెప్టెన్ పేరును ప్రకటించనుంది. గత సీజన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన డూప్లిసెస్‌ను జట్టు రిలీజ్ చేయడంతో తదుపరి కెప్టెన్ ఎవరనేది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతానికి కోహ్లీనే కెప్టెన్‌గా ప్రకటిస్తారని అందరిలోనూ అంచనాలున్నాయి. విరాట్ కాకుంటే కృనాల్ పాండ్య, భువనేశ్వర్, జితేశ్ శర్మలు రేసులో ఉన్నారు.
News February 13, 2025
పుతిన్‌కు ఫోన్ చేసి మాట్లాడిన ట్రంప్

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్లు US అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్, AI, ఎనర్జీ, పవర్ ఆఫ్ డాలర్‌తో పాటు పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఇరు దేశాల చరిత్ర, బలాలపై మాట్లాడుకున్నామని, త్వరలో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణనష్టాన్ని ఆపాలనుకుంటున్నామని చెప్పారు. త్వరలో ఒకరి దేశంలో మరొకరు సందర్శిస్తామన్నారు.
News February 13, 2025
వన్డేల్లో పాకిస్థాన్ రికార్డు ఛేజింగ్

పాక్-న్యూజిలాండ్-సౌతాఫ్రికా వన్డే ట్రై సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ విజయం సాధించింది. 353 పరుగుల లక్ష్యాన్ని 49 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వన్డేల్లో ఆ జట్టుకు ఇదే హైయెస్ట్ ఛేజింగ్. ఆ జట్టు బ్యాటర్లలో సల్మాన్ అఘా (134), కెప్టెన్ రిజ్వాన్ (122*) సెంచరీలతో రాణించారు. అంతకుముందు SA బ్యాటర్లలో బావుమా 82, మాథ్యూ బ్రీట్జ్కే 83, క్లాసెన్ 87 పరుగులు చేశారు.