News December 15, 2024
పది నిమిషాల్లో గమ్యం చేరుకుంటారనగా ప్రమాదం.. మృతి

చింతూరు మండలం వీరాపురం వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో తూ.గో జిల్లా రాజానగరం మండలానికి చెందిన చంద్రరావు(75) మృతి చెందిన సంగతి తెలిసిందే. పండ్ల వ్యాపారం చేసే చంద్రరావు తన భార్య, మనుమడితో కలిసి పండ్ల లోడ్ వ్యాన్‌తో చింతూరు మీదుగా కుంట బయలు దేరారు. మరో పది నిమిషాల్లో గమ్యస్థానం చేరుకుంటారనగా వ్యాన్ బోల్తా పడి వృద్ధుడు మృతి చెందాడు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో భార్య గుండెలవిసేలా విలపించారు.
Similar News
News February 26, 2026
ఫిబ్రవరి 28న బిక్కవోలు జాబ్ మేళా

బిక్కవోలులోని శ్రీ ప్రజ్ఞ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఫిబ్రవరి 28న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ గురువారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని చెప్పారు. టెన్త్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తిచేసి 19-30 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులన్నారు.
News February 26, 2026
దేవరపల్లి: తలపై రాయి పడి కార్మికుడు మృతి

దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని ఓ క్వారీలో బుధవారం జరిగిన ప్రమాదంలో అవిటి యేసు (42) అనే కార్మికుడు మృతి చెందాడు. పనుల్లో ఉండగా ప్రమాదవశాత్తు తలపై రాయి పడటంతో తీవ్ర గాయమైందని స్థానికులు తెలిపారు. చికిత్స కోసం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. దేవరపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 26, 2026
రాజమండ్రి: కల్తీ పాలను చిటికెలో కనిపెట్టండి ఇలా!

నిత్యం మనం వాడే పాలు కల్తీ అవుతున్నాయా? ఈ చిన్న పరీక్షలతో సులభంగా తెలుసుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పాలు సహజ సిద్ధమైన తీపి, క్రీమ్ వాసన కలిగి ఉంటాయని, చేదుగా లేదా రసాయన వాసన వస్తే అవి కల్తీవని గుర్తించాలి. కొద్దిపాటి పాలలో రెండు చుక్కల అయోడిన్ ద్రావణం కలిపినప్పుడు, ఆ పాలు నీలి రంగులోకి మారితే అందులో పిండి లేదా స్టార్చ్ కలిపినట్లు నిర్ధారించుకోవాలని నిపుణులు తెలిపారు.


