News April 2, 2025
పది లక్షల మందితో వరంగల్‌లో BRS సభ!

ఈనెల 27న HNK ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈమేరకు ఉమ్మడి జిల్లా నాయకులతో మంగళవారం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అయితే సభకు, ఇతర అవసరాలకు దాదాపు 1200 ఎకరాల వరకు అవసరమని, RTC బస్సులతో పాటు ఇతర వాహనాలు 40 నుంచి 50 వేల వరకు వస్తాయని అంచనా వేస్తున్నట్లు సమాచారం. 10 లక్షల మందితో సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 21, 2025
ఇందిరా గాంధీ స్టేడియానికి అంతర్జాతీయ హంగులు.!

అంతర్జాతీయ క్రీడల నిర్వహణ కోసం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియాన్ని ఉన్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2026 చివరి నాటికి ఆధునీకరించి, 2029లో అంతర్జాతీయ క్రీడలు నిర్వహించడమే లక్ష్యం. అంచనా వ్యయం రూ.53 కోట్లు మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ హాల్, బాక్సింగ్ ఎరీనా, అదనపు సింథటిక్ ఔట్‌డోర్ కోర్టులు, వసతి సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.
News November 21, 2025
యాషెస్ సిరీస్.. టాస్ గెలిచిన ఇంగ్లండ్

యాషెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
☛ AUS XI: ఖవాజా, వెదరాల్డ్, లబుషేన్, స్మిత్(C), హెడ్, గ్రీన్, క్యారీ, స్టార్క్, లియాన్, బ్రెండన్ డాగెట్, బోలాండ్
☛ ENG XI: డకెట్, క్రాలే, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్(C), J స్మిత్, అట్కిన్సన్, కార్స్, ఆర్చర్, వుడ్
☛ LIVE: స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్
News November 21, 2025
అక్రమ కేసులకు బెదిరేది లేదు: హరీశ్‌రావు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసులు పెట్టడం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అణచివేసే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఫార్ములా-ఈ రేస్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కోడిగుడ్డుపై ఈకలు పీకుతోందని తీవ్రంగా విమర్శించారు.


