News April 2, 2025
పది లక్షల మందితో వరంగల్లో BRS సభ!

ఈనెల 27న HNK ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈమేరకు ఉమ్మడి జిల్లా నాయకులతో మంగళవారం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అయితే సభకు, ఇతర అవసరాలకు దాదాపు 1200 ఎకరాల వరకు అవసరమని, RTC బస్సులతో పాటు ఇతర వాహనాలు 40 నుంచి 50 వేల వరకు వస్తాయని అంచనా వేస్తున్నట్లు సమాచారం. 10 లక్షల మందితో సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 26, 2025
గ్లోబల్ సమ్మిట్: పెట్టుబడిదారుల దృష్టికి సౌకర్యాల జాబితా

డిసెంబర్ 8, 9 తేదీల్లో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలనూ చేస్తోంది. ముఖ్యంగా ఇక్కడ సర్కారు కల్పించనున్న సౌకర్యాలను వారికి కూలంకుషంగా వివరించనుంది. ORR, RRR, IRR, గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి, బందర్ పోర్టు వరకు మార్గం, కొత్తగా నిర్మించే రైలు మార్గాలు తదితరాలను వారికి అర్థమయ్యేలా ప్రొజెక్ట్ చేయనుంది. ఎప్పుడూ.. ఎక్కడా.. ఎలాంటి సమస్యలు రానివ్వబోమని కచ్చితమైన హామీ ఇవ్వనుంది.
News November 26, 2025
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ చనిపోయారా?

పాక్ మాజీ PM ఇమ్రాన్ ఖాన్ జైలులో చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ను చూసేందుకు రావల్పిండిలోని అడియాలా జైలుకు వచ్చిన ఆయన ముగ్గురు సోదరీమణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జైలు బయట PTI మద్దతుదారులతో కలిసి వారు ఆందోళనకు దిగారు. తమ సోదరుడిని చూపించాలని డిమాండ్ చేశారు. పోలీసులు తమపై దాడి చేశారని, జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లారని ఆరోపించారు. 2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ జైలులో ఉన్నారు.
News November 26, 2025
వనపర్తి: నామినేషన్లకు సర్వం సిద్ధం: కలెక్టర్

గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ప్రక్రియను గురువారం ఉదయం 10:30 గంటల నుంచి ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. జిల్లాలో ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలు ఇప్పటికే టీ.పోల్లో అప్లోడ్ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.


