News April 2, 2025
పది లక్షల మందితో వరంగల్‌లో BRS సభ!

ఈనెల 27న HNK ఎల్కతుర్తిలో BRS సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈమేరకు ఉమ్మడి జిల్లా నాయకులతో మంగళవారం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అయితే సభకు, ఇతర అవసరాలకు దాదాపు 1200 ఎకరాల వరకు అవసరమని, RTC బస్సులతో పాటు ఇతర వాహనాలు 40 నుంచి 50 వేల వరకు వస్తాయని అంచనా వేస్తున్నట్లు సమాచారం. 10 లక్షల మందితో సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి సభకు మీరు వెళ్తున్నారా?
Similar News
News July 6, 2025
కామారెడ్డి: పీర్లను సందర్శించిన షబ్బీర్ అలీ

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మొహరంలో భాగంగా శనివారం రాత్రి హైదరాబాద్ పాతబస్తీలో పీర్ల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వ సలహాదారు వెంట కాంగ్రెస్ నాయకులు, ముస్లిం మత పెద్దలు ఉన్నారు. ఆయన మాట్లాడుతూ.. మొహరం అన్ని వర్గాల వారు జరుపుకోవడం అభినందనీయమన్నారు.
News July 6, 2025
కరీంనగర్ డీఈఓకు ఎస్జీటీయూ వినతి

DEO శ్రీరామ్ మొండయ్యకు ఈరోజు SGTU జిల్లా శాఖ పక్షాన పలు విద్యా సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. త్వరలో జరగనున్న సర్దుబాటు ప్రక్రియలో SGT ఉపాధ్యాయులను PS, UPS లకే కేటాయించాలని, హై స్కూల్స్‌కు కేటాయించవద్దని కోరారు. మల్కాపూర్ PSలో తీవ్ర టీచర్ల కోరత ఉందన్నారు. ప్రతి పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా చూడాలని, బడిబాటలో విద్యార్థుల సంఖ్య పెరిగిన పాఠశాలలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
News July 6, 2025
వీణవంక: గిన్నిస్ రికార్డు సాధించిన చిన్నారులకు కేంద్రమంత్రి సన్మానం

వీణవంక మండలానికి చెందిన బత్తిని నరేష్ కుమార్తె బత్తిని సహశ్రీ, వేముల సరివిక, కాసర్ల లాస్య గతేడాది హైదరాబాద్‌లో ప్రదర్శించిన కూచిపూడి నృత్యానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. వారిని శనివారం కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్, స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సత్కరించారు. గిన్నిస్ బుక్ రికార్డు పత్రాన్ని, మెడల్‌ను అందజేశారు. చిన్నారులను ప్రశంసించారు.