News April 2, 2025
పది లక్షల మందితో వరంగల్‌లో BRS సభ!

ఈనెల 27న HNK ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈమేరకు ఉమ్మడి జిల్లా నాయకులతో మంగళవారం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అయితే సభకు, ఇతర అవసరాలకు దాదాపు 1200 ఎకరాల వరకు అవసరమని, RTC బస్సులతో పాటు ఇతర వాహనాలు 40 నుంచి 50 వేల వరకు వస్తాయని అంచనా వేస్తున్నట్లు సమాచారం. 10 లక్షల మందితో సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 10, 2025
ఉచిత ఇసుక పారదర్శకతకు కృషి: కలెక్టర్

ఉచిత ఇసుకను పారదర్శకంగా నిర్వహించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని 4రీచ్‌లలో సెమీ మెకనైజ్డ్ పద్ధతి ద్వారా ఇసుక తీసేందుకు టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు. ఈ రీచ్‌లలో మర్లపాలెం, కపిలేశ్వరం, జొన్నాడ, ఆలమూరు రీచ్‌లు ఉన్నాయని కలెక్టర్ వివరించారు.
News December 10, 2025
సూర్యాపేట: BRS కార్యకర్త హత్య.. హరీశ్‌రావు ఫైర్

పంచాయతీ ఎన్నికల వేళ సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో BRS కార్యకర్త ఉప్పుల మల్లయ్య హత్య ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ అప్రజాస్వామిక, అరాచక పాలనకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్య విలువలను కాలరాయడం బాధాకరమన్నారు.
News December 10, 2025
కామారెడ్డి: జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు ఉదయ్ కిరణ్, అబ్దుల్ సమీర్ వాలీబాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు ఇన్‌ఛార్జి పీడీ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కళాశాల నుంచి జాతీయస్థాయికి విద్యార్థులు ఎంపిక కావడం అభినందనీయమన్నారు.


