News April 2, 2025

పది లక్షల మందితో వరంగల్‌లో BRS సభ!

image

ఈనెల 27న HNK ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈమేరకు ఉమ్మడి జిల్లా నాయకులతో మంగళవారం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అయితే సభకు, ఇతర అవసరాలకు దాదాపు 1200 ఎకరాల వరకు అవసరమని, RTC బస్సులతో పాటు ఇతర వాహనాలు 40 నుంచి 50 వేల వరకు వస్తాయని అంచనా వేస్తున్నట్లు సమాచారం. 10 లక్షల మందితో సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News July 11, 2025

త్వరలోనే TDP ఉనికి గల్లంతు: పెద్దిరెడ్డి

image

వచ్చే ఎన్నికల్లో YCP విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని MLA పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఎర్రాతివారిపల్లెలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన జీవితంలో మామిడిని రూ.2కే కొనడం ఎప్పుడూ చూడలేదన్నారు. కర్ణాటక కిలో మామిడిని రూ.16 మద్దతు ధరతో భారీగా అమ్ముతుంటే మన పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. త్వరలో TDP ఉనికి గల్లంతవ్వడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

News July 11, 2025

ములుగు జిల్లా జనసాంద్రత 71

image

ములుగు జిల్లా మొత్తం 3881 చ.కి.మి విస్తీర్ణం కలిగి ఉండగా 2,94,671 జనాభా ఉంది. వీరిలో పురుషులు 1,46,205, మహిళలు 1,48,466 ఉండగా జిల్లాలో జనసాంద్రత 71గా ఉంది. అయితే ఉమ్మడి కుటుంబంతోనే సంతోషంగా ఉండొచ్చని పలువురు అంటున్నారు. మారుతున్న కాలనీకి అనుగుణంగా పేరెంట్స్ ప్రస్తుతం ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. జనాభా పెరుగుదలతో అనేక సమస్యలు వస్తాయంటున్నారు. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం.

News July 11, 2025

కరీంనగర్: ‘రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయండి’

image

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జులై 12, 13 తేదీల్లో జరిగే రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి ఎస్. అనిల్ మాట్లాడుతూ.. తరగతుల్లో విద్యార్థి సమస్యలు, జాతీయవాదం, దేశభక్తి తదితర అంశాలపై చర్చ జరుగుతుందని తెలిపారు. ప్రారంభ ఉపన్యాసాన్ని గుమ్మడి నరసయ్య ఇవ్వనున్నారు.