News February 11, 2025

పదీ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్

image

జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 10,454 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అన్నారు. పరీక్ష కేంద్రాల ద్వారా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.

Similar News

News February 11, 2025

తిరుపతి జిల్లా హెడ్‌లైన్స్

image

✒నగరి ఎమ్మెల్యే సోదరుడు వైసీపీలో చేరికకు బ్రేక్!
✒ తిరుపతి జిల్లాలో 41.5 కేజీల గంజాయి స్వాధీనం
✒శ్రీకాళహస్తి: త్రిశూల స్నానానికి సిద్ధమవుతున్న స్వర్ణముఖి నది
✒తడ రైల్వే స్టేషన్ వద్ద రైలు ఢీకొని ఉద్యోగి మృతి
✒శ్రీవారి సేవలో సినీ నటుడు కార్తీ
✒SPMVV: ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
✒తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో నాపై దాడి: MP

News February 11, 2025

రామ్మోహన్ నాయుడుకు ‘యువ వక్త’ పురస్కారం

image

AP: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు అరుదైన గుర్తింపు లభించింది. పుణేలోని ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్శిటీ ఆయనకు ‘ఉత్తమ యువ వక్త ఆఫ్ పార్లమెంటరీ ప్రాక్టీసెస్’ అవార్డును ప్రదానం చేసింది. అతి పిన్న వయస్సులో ఎంపీగా, కేంద్ర క్యాబినెట్ మంత్రిగా రామ్మోహన్ తన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నారని నిర్వాహకులు కొనియాడారు. కాగా ఈ గౌరవం తన బాధ్యతను మరింత పెంచిందని ఆయన తెలిపారు.

News February 11, 2025

శ్రీకాకుళం: క్రీడా పోటీల్లో ప్రథమ స్థానం

image

రాష్ట్ర పీఈటి సంఘం ఆధ్వర్యంలో కాకినాడలో జరిగిన సెమినార్, క్రీడా పోటీలలో శ్రీకాకుళం జిల్లా హ్యాండ్ బాల్ జట్టు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో గెలుపొందిన జట్టుకు మంగళవారం జిల్లా కేంద్రంలో డీఈవో, తిరుమల చైతన్య, డిప్యూటీ డిఈవో విజయ కుమారి అభినందించారు. క్రీడా పోటీల్లో ప్రథమ స్థానం రావడం గర్వంగా ఉందన్నారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని ఆకాంక్షించారు.

error: Content is protected !!