News March 16, 2025
పదోతరగతి పరీక్షలు పటిష్టంగా నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో ఈనెల 17 నుంచి నిర్వహించే పదోతరగతి పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ వెట్రి సెల్వీ ఆదేశించారు. పేపరు లీకేజీలు వంటివి జరుగకుండా పటిష్ట భధ్రతా ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షల నిర్వహణపై సోషల్ మీడియా వంటి ప్రచార మాధ్యమాల్లో వదంతులు వ్యాపించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లను అనుమతించరాదన్నారు.
Similar News
News September 17, 2025
NZB: ‘రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది’

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజా వ్యవహారాలు) వేం నరేందర్రెడ్డి అన్నారు. NZBలో నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథి మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయ హస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించిందని పేర్కొన్నారు.
News September 17, 2025
రూ.100 కోట్ల క్లబ్లోకి ‘మిరాయ్’

తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ‘మిరాయ్’ మూవీ రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. మొదటి 4 రోజుల్లో రూ.91.45 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ చిత్రంలో మంచు మనోజ్, శ్రియ కీలక పాత్రలు పోషించగా విశ్వ ప్రసాద్ నిర్మించారు.
News September 17, 2025
జగిత్యాల: జడ్జి, ఎస్పీని కలిసిన అడిషనల్ కలెక్టర్

జగిత్యాల జిల్లా జడ్జి రత్న పద్మావతిని, ఎస్పీ అశోక్ కుమార్ ను అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాజా గౌడ్ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి ఆయన పుష్పగుచ్ఛం అందజేశారు. ఇటీవల నూతనంగా అడిషనల్ కలెక్టర్ గా నియమితులైన ఆయనకు వారు శుభాకాంక్షలు తెలిపారు.