News January 27, 2025
పదోన్నతి అర్హత పరీక్షకు పరిశీలించిన వరంగల్ సీపీ

హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐగా పదోన్నతికై మడికొండ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన అర్హత పరీక్షను వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం పరిశీలించారు. భద్రాద్రి, కాళేశ్వరం జోన్ల పరిధిలో వివిధ పోలీస్ స్టేషనల్లో విధులు నిర్వహిస్తున్న 108 సివిల్ హెడ్ కానిస్టేబుల్లకు అందజేసే ఏఎస్ఐ పదోన్నతికై సిటీ పోలీస్ శిక్షణ కేంద్రంలో అర్హత పరీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది.
Similar News
News February 13, 2025
రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకం: కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. రిటర్నింగ్ అధికారులకు మొదటి దశ శిక్షణ తరగతులకు హాజరై మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్ ప్రకటనను అనుసరిస్తూ ROలు నోటిఫికేషన్ జారీ చేసిన రోజే నామినేషన్ స్వీకరించాల్సి ఉంటుందన్నారు.
News February 13, 2025
కాగజ్‌నగర్: యువకుడిపై దాడి.. ముగ్గురి అరెస్ట్: CI

కాగజ్‌నగర్ పట్టణంలోని ద్వారకా నగర్‌కు చెందిన అక్రంపై అనుమానంతో ముగ్గురు వ్యక్తులు దాడి చేసిన విషయం తెలిసిందే. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై పట్టణ సీఐ రాజేంద్రప్రసాద్ విచారణ చేపట్టారు. పట్టణంలోని తైబానగర్ కాలనీకి చెందిన ఫారూక్, రాజిక్, సాదిక్‌లపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు.. అనంతరం వీరిని సిర్పూర్ JFCM కోర్టులో రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు.
News February 13, 2025
ప్రసాద్ స్కీం కింద నిధులు ఇవ్వండి: డీకే అరుణ

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ బుధవారం భేటీ అయ్యారు. ఉమ్మడి జిల్లా అలంపూర్ లోని ఐదవ శక్తి పీఠం జోగులాంబ టెంపుల్‌తో పాటు కురుమూర్తి, మన్నెంకొండ, మల్దకల్ తిమ్మప్ప దేవాలయాల అభివృద్ధికి ప్రసాద్ స్కీం కింద నిధులు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. ప్రతిపాదనలపై గజేంద్రసింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారని ఎంపీ పేర్కొన్నారు.