News January 27, 2025
పదోన్నతి పొందిన పోలీసులను అభినందించిన CP

రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి- మంచిర్యాల పరిధిలో 10 మంది హెడ్ కానిస్టేబుళ్లు ASIలుగా, ఇద్దరు ARహెడ్ కానిస్టేబుల్ లకు AR-SIలుగా పదోన్నతి పొందారు. వారిని CPశ్రీనివాస్ అభినందించి ర్యాంక్ పదోన్నతి చిహ్నాలను అలంకరించారు. ఈ సందర్భంగా CPమాట్లాడుతూ.. పదోన్నతులతో మరింత బాధ్యత పెరుగుతుందన్నారు. ప్రజల్లో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలన్నారు.
Similar News
News February 16, 2025
జనగామ: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 84 మంది గైర్హాజరు

జనగామ జిల్లాలో శనివారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు 84 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డిఐఈఓ జితేందర్ రెడ్డి తెలిపారు. మొదటి సెషన్‌లో 573 మంది విద్యార్థులకు గాను 509 విద్యార్థులు హాజరైయ్యారు. రెండవ సెషన్‌లో 397 మంది విద్యార్థులకు గాను 377 విద్యార్థులు హాజరయ్యారన్నారు.
News February 16, 2025
తాడ్వాయి: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామానికి చెందిన చిందం మల్లయ్య(48) అనే వ్యక్తి శనివారం ఉదయం ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మల్లయ్య బందువుల పెళ్లి ఉండటంతో చెట్టు కొమ్మలు కొడుతుండగా కొమ్మ విరిగి పక్కనే ఉన్న కరెంట్ లైన్ తీగలపై పడడంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మల్లయ్య భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
News February 16, 2025
మెదక్: గంజాయి మత్తు పదార్థాల బారీన పడకుండా చర్యలు: కలెక్టర్

రేపటి సమాజ నిర్మాతలైన యువత డ్రగ్ మహమ్మారి బారీన పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన నార్కోటిక్ కో-ఆర్డినేషన్ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ జిల్లా ఎస్పీ పాల్గొని పలు అంశాలపై సూచనలు చేశారు. యువతకు మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు.