News January 27, 2025

పదోన్నతులతో పాటు బాధ్యత పెరుగుతుంది: ASF SP

image

పదోన్నతులతో బాధ్యత పెరుగుతుందని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ముగ్గురు ఏఎస్ఐలుగా పదోన్నతులు పొందారు. వారిని ఎస్పీ అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కి వచ్చే ప్రజలతో మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

Similar News

News November 24, 2025

కొమురం భీమ్‌కు SP నివాళి

image

జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నితికా పంత్ కెరమెరి (M) జోడేఘాట్‌లోని ఆదివాసీ నాయకుడు కొమరం భీమ్ విగ్రహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఎస్పీ, ఏఎస్పీకి ఆదివాసీ పెద్దలు పూల మొక్కలు అందించి, తలపాగా చుట్టి ఘనస్వాగతం పలికారు. గిరిజన ఆచార సంప్రదాయాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. మారుమూల గిరిజన ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సహాయం అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

News November 24, 2025

సంగారెడ్డి: రేపు వడ్డీ లేని రుణాల పంపిణీ

image

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించాలని కలెక్టర్ ప్రావీణ్య సోమవారం తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి పిలవాలని చెప్పారు. జిల్లాలోని 15,926 మహిళా సంఘాలకు 16.78 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News November 24, 2025

యూకేని వీడనున్న మిట్టల్!

image

భారత సంతతి వ్యాపారవేత్త లక్ష్మీ ఎన్. మిట్టల్ యూకేని వీడనున్నారు. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెరగడం, కుటుంబ వ్యాపారాలపై కొత్త రూల్స్, ప్రపంచంలో ఎక్కడ సంపాదించినా యూకేలో పన్ను చెల్లించాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన పన్నులు లేని దుబాయ్‌లో సెటిల్ కానున్నారు. ఇప్పటికే అక్కడ ఓ ల్యాండ్ కొన్నారు. కాగా మిట్టల్ $21.4 బిలియన్ల సంపదతో ప్రపంచ ధనవంతుల్లో 104వ స్థానంలో ఉన్నారు.