News February 9, 2025
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: కలెక్టర్ రాజకుమారి

సంక్షేమ వసతి గృహాలలో పదో తరగతి విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి విద్యార్థులకు ఉద్బోధించారు. పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌ను అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. బొమ్మల సత్రంలోని బాలికల వసతి గృహంలో ప్రతి విద్యార్థినికి పదో తరగతి పరీక్షలు రాయడానికి అవసరమైన మెటీరియల్స్‌ను కలెక్టర్ అందజేశారు.
Similar News
News April 10, 2026
వికారాబాద్: ఈనెల 13న నేషనల్ అప్రెంటిస్ మేళా

ప్రభుత్వ పారిశ్రామిక సంస్థ ఏటీసీ ఐటీఐలలో నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు వికారాబాద్ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ నరేంద్రబాబు తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీఐలో ఈనెల 13న ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా జరుగుతుందన్నారు. ఈ మేళాలో వివిధ కంపెనీల యజమాన్యాలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని, ఐటీఐ చేసినవారు హాజరు కావొచ్చన్నారు. మరిన్ని వివరాలకు 9177472488ను సంప్రదించవచ్చు.
News April 10, 2026
ముద్దు ముచ్చట తీరకముందే బకెట్ తన్నేస్తారా?

పెళ్లి, పిల్లల ముద్దుముచ్చట్లు, రిటైర్మెంట్ లైఫ్.. ఇవన్నీ అనుభవించాల్సిన జీవితాన్ని నేటి యువత చేజేతులా నాశనం చేసుకుంటోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘గంటల తరబడి కూర్చొని పని చేయడం, జంక్ ఫుడ్, ఒత్తిడి తగ్గాలని స్మోకింగ్, నిద్ర కోసం మద్యం సేవించడం ప్రాణాంతకం. సంపూర్ణమైన జీవితం గడపాలంటే తక్షణమే జీవనశైలి మార్చుకోండి. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోండి’ అని డాక్టర్లు సూచిస్తున్నారు.
News April 10, 2026
ప్రతి గింజను కొంటాం.. వారంలోపే నగదు జమ: పొంగులేటి

రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. కూసుమంచి మండలం చేగొమ్మలో గోదామును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొన్న వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. ధరణితో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగించి, ‘భూ భారతి’ ద్వారా సుపరిపాలన అందిస్తున్నామని పేర్కొన్నారు.


