News March 21, 2025

పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి:కలెక్టర్ 

image

రేపటి నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు. పది పరీక్షలు ప్రతి విద్యార్థి జీవితానికి మైలురాయి అని, దీన్ని అధిగమించడానికి మీరు ఎంత దృఢంగా నిలబడతారో తదుపరి ఉజ్వల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు.

Similar News

News November 19, 2025

సంగారెడ్డి: వాహనాలు జాగ్రత్తగా నడిపించాలి: ఎస్పీ

image

ఉదయం సమయంలో వాహనాలను జాగ్రత్తగా నడిపించాలని ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. ఉదయం 8 గంటల వరకు పొగ మంచు పడుతున్నందున ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవచ్చని చెప్పారు. ఉదయం సమయంలో సాధ్యమైనంత వరకు బయటకు రాకపోవడమే మంచిదని పేర్కొన్నారు. వాహనాల హెడ్ లైట్లు ఇండికేటర్లు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. కార్లలో వెళ్లేవారు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలన్నారు.

News November 19, 2025

మూవీ ముచ్చట్లు

image

*రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రం నుంచి ‘రణ కుంభ’ ఆడియో సాంగ్ విడులైంది.
*‘బాహుబలి ది ఎపిక్’ సినిమా జపాన్‌లో రిలీజ్ కానుందని సమాచారం. డిసెంబర్ 12న విడుదల చేస్తారని, 5న ప్రీమియర్‌కు ప్రభాస్‌, నిర్మాత శోభు యార్లగడ్డ హాజరవుతారని తెలుస్తోంది.
*ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా విజువల్‌గా, మ్యూజికల్‌గా భారీగా ఉండబోతోంది: మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్

News November 19, 2025

HYD: ఈనెల 19న పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు కౌన్సిలింగ్‌

image

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన PG & PhD ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ ఈనెల 19న జరగనుంది. యూనివర్సిటీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు హాజరు కావాలని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.