News March 22, 2024
పదో తరగతి పరీక్షలకు 1,385 మంది విద్యార్థుల గైర్హాజరు

శ్రీ సత్యసాయి జిల్లాలో శుక్రవారం జరిగిన పదవ తరగతి పరీక్షలకు 1,385 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి తెలిపారు. శుక్రవారం జరిగిన మ్యాథ్స్ పరీక్షలో పెనుకొండ సబ్ డివిజన్ నుంచి 791 మంది విద్యార్థులు, ధర్మవరం సబ్ డివిజన్ నుంచి 594 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News February 26, 2026
31,972 మంది విద్యార్థులు.. 143 పరీక్ష కేంద్రాలు

అనంతపురం జిల్లాలో మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 143 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. దాదాపు 31,972 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఎటువంటి అవకతవకలు జరగకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
News February 25, 2026
గుంతకల్లు డివిజన్‌లో ఖాళీల భర్తీకి కసరత్తు

సౌత్ సెంట్రల్ రైల్వే గుంతకల్లు డివిజన్‌లో పాయింట్స్ మెన్ ఖాళీల భర్తీ కోసం 16 మంది మాజీ సైనికులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. రూ.18,000 వేతనం, ఇతర భత్యాలు చెల్లించనున్నారు. మాజీ సైనికులు మార్చి 6వ తేదీ లోపు దరఖాస్తులను గుంతకల్లు డివిజన్ కార్యాలయానికి సమర్పించాలన్నారు. మరిన్ని వివరాల కోసం 08554 241146 సంప్రదించవచ్చన్నారు.
News February 24, 2026
తాడిపత్రిలో కారు బీభత్సం.. 2 భాగాలుగా విడిపోయిన ట్రాక్టర్ ఇంజిన్

తాడిపత్రి మండలంలో కారు బీభత్సం సృష్టించింది. రూరల్ పరిధిలోని ఆర్డీటీ కాలనీ సమీపంలో ట్రాక్టర్‌ను కారు ఢీకొంది. ప్రమాదంలో ట్రాక్టర్ ఇంజిన్ భాగాలు రెండుగా విడిపోయాయి. కారుకు సేఫ్టీ బెలూన్స్ ఓపెన్ కావడంతో కారులో ఉన్న వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. ట్రాక్టర్ డ్రైవర్‌కు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


