News March 19, 2024

పదో తరగతి పరీక్షలు..మొదటి రోజు 99.61% హాజరు

image

MBNR:పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు మొత్తం 12,738 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు 59 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెగ్యులర్ విద్యార్థులకు 58 కేంద్రాలు ఏర్పాటు చేయగా గతంలో అనుత్తీర్ణులై మళ్లీ ఫీజు చెల్లించిన వారికి ఒక కేంద్రం ఏర్పాటు చేశారు.జిల్లా కలెక్టర్ రవినాయక్-2,జిల్లాస్థాయిఅధికారులు-7,DEO రవీందర్-6,ప్లయింగ్ స్క్వాడ్స్ 24 కేంద్రాలను తనిఖీ చేశాయి.

Similar News

News April 11, 2025

ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్లనిర్మాణానికి ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తహశీల్దార్లు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మఇంటి నిర్మాణాలకు కావాల్సిన ఇసుకను లబ్ధిదారులకు సరఫరా చేసేందుకు పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరించి తహశీల్దార్లకు పంపించాలన్నారు. 

News April 11, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!

image

✔పలుచోట్ల ఈదురుగాలులతో వర్ష బీభత్సం
✔రేపు పూలే జయంతి వేడుకలు
✔నాగర్‌కర్నూల్: సిరసనగండ్ల రథోత్సవంలో లక్షల మంది
✔సళేశ్వరంలో ఆదివాసీ చెంచులే పూజారులు
✔KCR సభకు..BRS పార్టీ శ్రేణులకు పిలుపు
✔ఉమ్మడి జిల్లాల్లో జోరుగా వరి కోతలు
✔NGKL:చిన్నతగాదాతో భార్యాభర్తల సూసైడ్
✔IPL బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు:ఎస్సైలు
✔పలుచోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

News April 10, 2025

ఇక నుంచి మానవ డోనర్ మిల్క్: జిల్లా కలెక్టర్

image

చంటి బిడ్డలకు తల్లిపాలు అందుబాటులో లేనప్పుడు మానవ డోనర్ మిల్క్‌ను అందించే సదుపాయాన్ని రాష్ట్రంలోనే మొదటిసారిగా MBNR ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇది ఒక అద్భుతమైన అవకాశమని కలెక్టర్ విజయేంద్ర బోయి కొనియాడారు. సుశేషణ హెల్త్ ఫౌండేషన్ సహకారంతో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సమగ్ర లాక్టేషన్ మేనేజ్మెంట్ సెంటర్‌ని ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్ ప్రారంభించారు.

error: Content is protected !!