News November 19, 2024

పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువు పొడిగింపు: డీఈవో

image

పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువు పొడిగించినట్లు అనంతపురం డీఈవో ప్రసాద్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26వ తేదీ వరకు ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ.50 ఫైన్‌తో డిసెంబర్ 2వ తేదీ వరకు, రూ.200తో డిసెంబర్ 9, రూ.500తో 16వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చవచ్చునని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

Similar News

News March 7, 2026

సమన్వయంతో విజయవంతం చేయండి: కలెక్టర్

image

ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అధికారులు సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఐసీడీఎస్, డీఆర్డీఏ, మెప్మా శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డీఆర్డీఏ, మెప్మా సంబంధిత శాఖల సమన్వయంతో ప్రతీ సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు.

News March 6, 2026

నిధులు విడుదల చేయండి: మంత్రి, ఎమ్మెల్యేలు

image

అనంతపురంలోని నడిమి వంక, మరువ వంక ప్రొటెక్షన్ వాల్స్ కోసం రూ.79.46 కోట్ల కేటాయించాలని సీఎం చంద్రబాబుకు MLA దగ్గుపాటి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. అలాగే మున్సిపాల్టీలో అభివృద్ధి పనుల కోసం పెండింగ్‌లో ఉన్న రూ.18.84 కోట్ల విడుదల చేయాలని కోరారు. శిల్పారామంలో మౌళిక వసతుల కల్పన కోసం రూ.9.95 కోట్లు కేటాయించాలని సీఎంను విజ్ఞప్తి చేశారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారని MLA తెలిపారు.

News March 6, 2026

అనంత విద్యార్థులకు ఇన్‌ఫోసిస్‌లో ఉద్యోగాలు

image

అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటారు. Infosys కంపెనీ నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 8మంది ఎంపికయ్యారు. వీరికి రూ.6.25 లక్షల వార్షిక వేతనం లభించినట్లు ప్లేస్‌మెంట్ ఆఫీసర్ చిత్ర తెలిపారు. ఎంపికైన వారిని వీసీ హంచాటే సుదర్శనరావు, ప్రిన్సిపల్ చెన్నారెడ్డి అభినందించారు. విద్యార్థులు తమ నైపుణ్యాలతో మంచి అవకాశాలు దక్కించుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.