News April 15, 2025
పదో తరగతి మూల్యాంకనం పూర్తి: డీఈవో సత్యనారాయణ

జిల్లాలో జరిగిన పదో తరగతి పరీక్షల జవాబు ప్రశ్నపత్రాల మూల్యాంకనం పూర్తైనట్లు డీఈవో సత్యనారాయణ తెలిపారు. బీబీనగర్ మండలం గూడూరులో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ నెల 7 నుంచి 15 వరకు జరిగిన మూల్యాంకనంలో 1,60,997 జవాబు పత్రాలను 781 మంది ఉపాధ్యాయులు మూల్యాంకనం చేశారన్నారు. వాల్యువేషన్ ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా జరిగిందన్నారు.
Similar News
News December 1, 2025
గ్రామాభివృద్ధికి ఐలయ్య కృషి!

MHBD జిల్లా ఇనుగుర్తి పంచాయతీకి ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నికై గ్రామాభివృద్ధి కోసం కృషి చేసిన దివంగత గండు ఐలయ్యకు గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేశారు. 1971 నుంచి 1983 వరకు ఐలయ్య సర్పంచ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ కాలంలో ఆయన గ్రామాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యాడు.
News December 1, 2025
‘108’ సంఖ్య విశిష్టత

ధర్మశాస్త్రాల ప్రకారం.. మానవుడి శరీరంలో 108 ముఖ్యమైన నరాలు, మెదడులో 108 శక్తి కేంద్రాలు ఉన్నాయని చెబుతారు. వీటన్నింటినీ ఉత్తేజితం చేయడానికి ఓ మంత్రాన్ని కనీసం 108 సార్లు పఠించాలని సూచిస్తారు. ఇలా చేస్తే మంత్రంలోని శక్తి ఈ కేంద్రాలన్నింటికీ ప్రసరించి, సంపూర్ణ ఆధ్యాత్మిక ఫలం వస్తుందని నమ్మకం. పగడాల మాలతో జపం చేస్తే.. వేయింతల ఫలం, రత్నమాలతో చేస్తే పదివేల రెట్ల ఫలం వస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి.
News December 1, 2025
SBIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

SBIలో 15 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. వీటిలో 5 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు, 10 మేనేజర్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు ఈ పోస్టులకు వేర్వేరుగా అప్లై చేసుకోవాలి. ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ , బీఈ, బీటెక్, MBA/MS/PGDBM/PGDBA ఫైనాన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://sbi.bank.in


