News March 2, 2025

పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ ‘విజయోస్తు’ లేఖ

image

ఈనెల 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షకు ప్రారంభం కానున్న నేపథ్యంలో జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా స్వయంగా లిఖించి ముద్రించిన ‘ విజయోస్తు ‘ లేఖలను విద్యార్థులకు అందిస్తున్నారు. పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు కావాల్సిన పంచసూత్రాలను పాటిస్తూ చదవాలని లేఖలో పొందుపరిచారు. జిల్లాలోని ప్రతి విద్యార్థికి ఈ లేఖలను కలెక్టర్ అందించి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

Similar News

News November 14, 2025

ఆలు లేత, నారు ముదర అవ్వాలి

image

ఈ సామెతలో ఆలు అంటే తమలపాకు. అది ఎంత లేతగా ఉంటే అంత రుచిగా, మృదువుగా ఉంటుంది. అలాగే మనిషి కూడా కొన్ని(స్వభావం, మాటతీరు) విషయాల్లో మృదువుగా, సున్నితంగా ఉండాలి. ఇక్కడ నారు అంటే వరి నారు, మొక్కల నారు. అది నాటే సమయానికి ముదురుగా ఉంటేనే మంచి పంట వస్తుంది. అలాగే మనిషి కూడా కొన్ని విషయాల్లో (విలువలు, నిర్ణయాలు, పట్టుదల) దృఢంగా, స్థిరంగా ఉంటే మంచిదని ఈ సామెత అర్థం.

News November 14, 2025

SAvsIND: ఈ‘డెన్’ మనదేనా?

image

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో నేటి నుంచి టీమ్ఇండియా తొలి టెస్టు ఆడనుంది. ఈడెన్‌లో 42 మ్యాచులు ఆడిన భారత్ 13 గెలిచి, 9 ఓడగా మరో 20 మ్యాచులు డ్రాగా ముగిశాయి. చివరగా 2019లో BANతో జరిగిన టెస్టులో భారత్‌ గెలిచింది. అయితే ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌ SAను తక్కువ అంచనా వేయొద్దని గిల్ సేన భావిస్తోంది. 9.30AMకు మ్యాచ్ మొదలుకానుంది. స్టార్ స్పోర్ట్స్, జియోహాట్ స్టార్‌లో లైవ్ చూడవచ్చు.

News November 14, 2025

బిహార్: ఓటింగ్ పెరిగితే ఫలితాలు తారుమారు!

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం భారీగా పెరిగిన ప్రతిసారీ అధికార పార్టీ కుర్చీ దిగిపోయిందని గత ఫలితాలు చెబుతున్నాయి. 1967లో దాదాపు 7% ఓటింగ్ పెరగగా అధికారంలోని INC కుప్పకూలింది. 1980లోనూ 6.8%, 1990లోనూ 5.7%శాతం పెరగగా అధికార మార్పిడి జరిగింది. ఇక తాజా ఎన్నికల్లోనూ 9.6% ఓటింగ్ పెరిగింది. మళ్లీ అదే ట్రెండ్ కొనసాగుతుందా లేక ప్రజలు NDAకే కుర్చీ కట్టబెడతారా అనేది ఈ మధ్యాహ్ననికి క్లారిటీ రానుంది.