News January 23, 2025
పదో తరగతి విద్యార్థులపై దృష్టి సారించండి: నిర్మల్ DEO

పదో తరగతి విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని DEO రామారావు అన్నారు. బుధవారం ముధోల్ మండలం అష్ట ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వెనుకబడిన వారిని ప్రత్యేక తరగతుల ద్వారా ప్రోత్సహించాలన్నారు. పదో వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.
Similar News
News February 16, 2025
భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పినపాక మండలం దుగినేపల్లి గ్రామం చెగర్శల సరిహద్దు వద్ద బైక్ పై వెళ్తున్న ఇద్దరు గుంతను తప్పించబోయి కిందపడ్డారు. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మాటూరి హనుమంతరావు, మునిగెల నాగేశ్వరరావుగా స్థానికులు గుర్తించారు. మృతులు ఇద్దరు ఒకే ఇంటికి చెందిన అల్లుళ్లుగా సమాచారం.
News February 16, 2025
HYD: నుమాయిష్‌కు రేపే లాస్ట్

HYDలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్‌కు సందర్శకులు పోటెత్తుతున్నారు. రేపు చివరి రోజు కావడంతో నుమాయిష్‌ను సందర్శించేందుకు భారీగా తరలివస్తున్నారు. శనివారం రికార్డు స్థాయిలో 90 వేల మందికి పైగా సందర్శకులు వచ్చినట్లు సొసైటీ బుకింగ్ కమిటీ కన్వీనర్ సత్యేందర్, ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి సురేందర్ రెడ్డి తెలిపారు. జనవరి 3వ తేదీన ప్రారంభమైన నుమాయిష్ రేపటితో ముగియనున్న విషయం తెలిసిందే.
News February 16, 2025
భారత్‌కు వారసులు హిందువులే: మోహన్ భాగవత్

దేశంలో హిందూ సమాజమే బాధ్యతాయుతమైనదని RSS చీఫ్ మోహన్ భాగవత్ చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందనే సత్యాన్ని హిందువులు విశ్వసిస్తారన్నారు. బెంగాల్‌లో మాట్లాడుతూ భారత్‌కు వారసులు హిందువులేనని పేర్కొన్నారు. ‘పాలకులు, మహారాజులను దేశం గుర్తుంచుకోదు. కానీ తండ్రి మాటకు కట్టుబడి 14ఏళ్ల వనవాసం చేసిన రాజును, సోదరుడి చెప్పులతో పాలన చేసిన వ్యక్తిని గుర్తుంచుకుంటుంది’ అని తెలిపారు.