News March 3, 2025

పదో తరగతి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి: DEO సలీం బాషా

image

ప్రభుత్వం పదో తరగతి హాల్ టికెట్లను విడుదల చేసిందని డీఈఓ షేక్ సలీమ్ బాషా సోమవారం తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. వాట్సాప్ నంబర్‌కు హాయ్ అని పెట్టాలని, ప్రభుత్వ సర్వీసులు డిస్ ప్లే అవుతాయన్నారు. విద్యా శాఖను ఎంపిక చేసుకొని ఆధార్ లేదా రూల్ నంబర్, పుట్టిన తేదీ ఎంట్రీ చేసి సబ్మిట్ కొడితే హాల్ టికెట్ పీడీఎఫ్ వస్తుందన్నారు.

Similar News

News March 25, 2025

కొత్త సినిమాల టికెట్ ధరల పెంపునకు గ్రీన్‌సిగ్నల్

image

ఉగాది సందర్భంగా రిలీజయ్యే కొత్త సినిమాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నార్నె నితిన్, సంతోష్ శోభన్ కాంబోలో తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్’, నితిన్ నటించిన ‘రాబిన్‌హుడ్’ సినిమాల టికెట్ ధరల పెంపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్‌లలో రూ.50, మల్టీప్లెక్సుల్లో టికెట్ ధరలపై రూ.75 పెంచుకునేందుకు అనుమతిచ్చింది. పెరిగిన ధరలు 7 రోజుల పాటు అందుబాటులో ఉంటాయంది. TGలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

News March 25, 2025

సిరిసిల్ల జిల్లాలోని ఉష్ణోగ్రతల వివరాలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. సిరిసిల్ల 37.9 °c, వీర్నపల్లి 37.8°c, గంభీరావుపేట 37.8°c, కోనరావుపేట 37.6°c, రుద్రంగి 37.7°c, తంగళ్లపల్లి 35.6°c, ఇల్లంతకుంట 35.9°c,ఎల్లారెడ్డిపేట 35.0°cలుగా నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది.  

News March 25, 2025

విశాఖ రైతు బజార్‌లో నేటి కూరగాయల ధరలు

image

విశాఖ రైతు బజార్‌లలో మంగళవారం నాటి కూరగాయల ధరలు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు ఈ విధంగా నిర్ణయించారు. ఉల్లిపాయలు రూ.23, బంగాళ రూ.15, టమాటలు రూ.15, బెండకాయలు రూ.30, వంకాయలు రూ.27/32/40,కాకరకాయలు రూ.38, ఆనపకాయ రూ.14, బీరకాయలు రూ.42, క్యాబేజి రూ.12, కాలి ఫ్లవర్ రూ.20, దొండకాయలు రూ.30,బీట్ రూట్ రూ.20,పొటల్స్ రూ. 46,మునగకాడలు రూ.28, క్యారట్ రూ.20,కీరా దోసకాయ రూ.22,మామిడి కాయలు రూ.40గా నిర్ణయించారు.

error: Content is protected !!