News January 27, 2025
పద్మనాభం: ఉరి వేసుకుని మహిళ, యువకుడు మృతి
పద్మనాభ (మం) కృష్ణాపురంలో ఓ మహిళ, యువకుడు మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. వివాహిత మహిళ లక్ష్మి(31), మోకర ఆదిత్య(21) గ్రామంలో వేర్వేరు చోట్ల ఉరి వేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. వారి బంధువుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పద్మనాభం సీఐ శ్రీధర్ తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News January 30, 2025
మత్స్యకారుల జీవనోపాధి కాపాడాలి: డా.రాజేంద్రసింగ్
1000 కి.మీ.ల సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న ఏపీలో పరిశ్రమల కాలుష్యం వలన సుమారు 2లక్షల మత్స్యకార కుటుంబాలు జీవనోపాధిని కోల్పోతున్నారని డా.రాజేంద్రసింగ్ అన్నారు. విశాఖలో తీర ప్రాంతాన్ని ఆయన గురువారం సందర్శించారు. మత్స్యకారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. తాబేళ్లు మృత్యువాత బాధాకరమన్నారు. దీనిపై పొల్యూషన్ బోర్డు, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని మత్స్యకారుల జీవనోపాధిని కాపాడాలని కోరారు.
News January 30, 2025
పరీక్ష ఫీజు గడువు పెంపు: విశాఖ డీఈవో
2023-2025లో జరుగబోయే డీ.ఎల్.ఈడి 3rd సెమెస్టర్ రెగ్యులర్, ఫెయిల్ అయిన విద్యార్థులకు పరీక్ష రుసుము గడువు తేది ఫిబ్రవరి 4వరకు పొడిగించడమైనదని డిఈఓ ప్రేమ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు రూ.250, నాలుగు నుంచి ఆరు సబ్జెక్టులకు రూ.250, మూడు సబ్జెక్టులకు రూ.175, రెండు సబ్జెక్టులకు రూ.150, ఒక సబ్జెక్టుకు రూ.125 చెలించాలన్నారు.
News January 30, 2025
విశాఖ జిల్లాలో పర్యవేక్షణకు 23 బృందాలు
విశాఖ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గురువారం తెలిపారు. వివిధ స్థాయి అధికారులతో కూడిన 12 ఎంసీసీ బృందాలను నియమించామన్నారు. మండలానికి ఒకటి చొప్పున 11ఫ్లైయింగ్ స్వ్కాడ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. జీవీఎంసీ అదనపు కమిషనర్, జడ్పీ సీఈవో, భీమిలి, విశాఖ ఆర్డీవోలను నోడల్ అధికారులుగా నియమించినట్లు వెల్లడించారు.