News January 28, 2025

పద్మనాభం: రెండు కుంటుబాల్లో తీవ్ర విషాదం

image

పద్మనాభం మండలం కృష్టాపురంలో ఒకే రోజు <<15283151>>ఇద్దరు సూసైడ్<<>> చేసుకున్న ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. వివాహిత కనకల లక్ష్మి(30) మరణంతో ఆమె ఇద్దరు కుమారులు తల్లి లేనివారయ్యారు. ఒక్కగానొక్క కొడుకు మొరక ఆదిత్య(22) ఇంక లేడన్న వార్తను అతని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆటల్లో చురుగ్గా ఉండే ఆదిత్య తండ్రి వైద్యారోగ్యశాఖలో చిరుద్యోగి కాగా.. లక్ష్మి భర్త లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

Similar News

News February 14, 2025

విశాఖలో కీచక భర్తకు రిమాండ్

image

<<15458247>>పోర్న్ వీడియోలకు<<>> బానిసైన గోపాలపట్నంకి చెందిన నాగేంద్ర తన భార్య వసంతను అదేవిధంగా చేయాలని ఒత్తిడి చేశాడు. దీంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. అయితే ఘటనను సీరియస్‌గా తీసుకున్న విశాఖ పోలీసులు నాగేంద్రపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం నిందితుడు విశాఖ సెంట్రల్ జైల్‌లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

News February 14, 2025

విశాఖ: పోలీసుల అదుపులో డ్రగ్స్ నిందితులు

image

ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన షేక్ ముధఫర్, మహమ్మద్ చాంద్, షేక్ అనీష్ విశాలాక్షి నగర్‌లో <<15460513>>బ్రౌన్ షుగర్ <<>>అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే టాస్క్ ఫోర్స్, ఆరిలోవ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. 

News February 14, 2025

భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి: కలెక్టర్

image

ప్ర‌భుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ అధికారులు త‌గిన‌ జాగ్ర‌త్తలు వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. శుక్ర‌వారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం అయ్యారు. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే విన‌తుల‌కు స‌కాలంలో స‌మాధానం చెప్పాల‌న్నారు. స‌మ‌స్య‌ల‌ను నిర్ణీత గడువులో ప‌రిస్క‌రించాల‌ని సూచించారు. ప్ర‌భుత్వ భూములు, చెరువులు, కాలువ‌ల అన్యాక్రాంతాన్ని అవ్వకుండా చర్యలు చేపట్టాలన్నారు.

error: Content is protected !!